స్టోర్ట్స్ అండ్ గేమ్స్.ప్రతి మనిషికి ఇవ్వంటే చాలా ఇష్టం.
ఖాళీ సమయం దొరికితే పిల్లల నుంచి పెద్దల దాకా ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు.అలాగే క్రీడా సంబంధ అంశాలతో తెలుగులో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి.
ఆటల పట్ల ఉన్న కాస్త అవగాహనను బేస్ చేసుకుని మంచి కథ అల్లి సినిమాలుగా తీశారు దర్శకులు.ఈ సినిమాలన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అభించింది.ఇంతకీ స్పోర్ట్స్ బేస్ గా వచ్చిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గురు
కూరగాయల వ్యాపారం చేసే రామేశ్వరి ఇంటర్నేషన్ బాక్సర్ గా ఎదిగే స్టోరీతో తీసిని సినిమా గురు.ఈ సినిమాలో కోచ్ గా వెంకటేష్ నటించగా.రితికా సింగ్ రామేశ్వరిగా నటించింది.
కౌసల్యా కృష్ణమూర్తి
ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అమ్మాయిల్లో క్రీడా స్పూర్తిని నింపింది.మారుమూల గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా సత్తా చాటే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
సై
కాలేజీ మైదానం కోసం రౌడీ గ్యాంగ్ తో విద్యార్థులు చేసిన పోరాటాన్ని కథ ఎంచుకుని తీసిన సినిమా సై.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా అందరినీ ఆకట్టుకుంది.
భీమిలి కబడ్డి జట్టు
నాని, శరణ్య మోహన్ జంటగా నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కాకపోయినా.ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమా ఎండింగ్ లో నాని మరణాన్ని ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు.
జెర్సీ
నాని హీరోగా చేసిన మరో సినిమా జెర్సీ.2019లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తను చనిపోతానని ముందే తెలిసినా.క్రికెట్ కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి క్యారెక్టర్ లో నాని అద్భుత నటన కనబరిచాడు.
ఒక్కడు
మహేష్ బాబు సినిమాల్లో సూపర్ హిట్ మూవీ ఒక్కడు.ఇందులో మహేష్ కబడ్డి ప్లేయర్ గా కనిపిస్తాడు.
గోల్కొండ హైస్కూల్
సుమంత్ క్రికెట్ కోచ్ గా నటించిన ఈ సినిమా అంతాగా విజయం సాధించకపోయినా.మంచి ప్రశంసలు దక్కాయి.
భద్రాచలం
శ్రీహరి నటించిన ఈ సినిమాలో శ్రీహరి తైక్వాండో ప్లేయర్ గా కనిపించాడు.ఈ సినిమాలో పాటలు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తమ్ముడు
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బాక్సింగ్ ప్లేయర్ గా చేశాడు.ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
అమ్మానాన్న ఓ తమిళమ్మాయి
ఈ సినిమాలో రవితేజ కిక్ బాక్సర్ గా కనిపిస్తాడు.తండ్రి ఆశయం నెరవేర్చడమే లక్ష్యంగా రవితేజ కొట్లాడుతాడు.
బావ
మరదలి ప్రేమ కోసం ఇందులో సిద్ధార్థ్ సైకిల్ పోటీలో విజయం సాధిస్తాడు.
మనసారా
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమా క్లైమాక్స్ కేరళ సంప్రదాయ క్రీడ కలరిపయట్టు చుట్టూ తిరుగుతుంది.హీరోయిన్ ప్రేమను పొందేందుకు హీరో ఈ క్రీడలో విజయం సాధిస్తాడు.
ఆశ్విని
పిటి ఉషను ఓడించిన అశ్విని కొన్ని సినిమాల్లో నటించింది.ఆమె కీరోల్ చేసిన తొలి మూవీ అశ్వినిలో రన్నర్ గా మంచి నటన కనబరిచారు.