కోడి గుడ్లే కాదు బాతు గుడ్లు ఆరోగ్య‌మే.. వారానికి ఎన్ని సార్లు తినొచ్చంటే..?

గుడ్లు సంపూర్ణ పోషకాహారం అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అందుకే చాలా మంది నిత్యం రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తింటూ ఉంటారు.

 Health Benefits Of Eating Duck Eggs! Duck Eggs, Duck Eggs Health Benefits, Eggs,-TeluguStop.com

అయితే గుడ్లు అనగానే మనందరికీ కోడి గుడ్డులే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే వాటినే మనం తింటూ ఉంటాము.

కానీ కోడి గుడ్లే కాదు బాతు గుడ్లు( Duck Eggs ) కూడా ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు.కోడిగుడ్లు మాదిరిగానే బాతు గుడ్లలో సైతం పోషకాలు మెండుగా ఉంటాయి.

బాతు గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ కె, విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, సెలీనియం కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే.

Telugu Duck Eggs, Eggs, Tips-Telugu Health

అందువల్ల బాతు గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా బాతు గుడ్లు మీ బ్రెయిన్ కు చాలా మంచివి.బాతు గుడ్లు మెదడుకు అవసరమైన కొవ్వులు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.మెదడు కణాలను రక్షిస్తాయి మరియు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.బాతు గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.ప్రోటీన్ కొరతతో బాధపడే వారికి బాతు గుడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Telugu Duck Eggs, Eggs, Tips-Telugu Health

అలాగే ఆరోగ్యకరమైన దృష్టికి, మచ్చల క్షీణతకు మరియు కంటిశుక్లం వంటి కొన్ని కంటి వ్యాధుల( Eye diseases ) నివారణకు బాతు గుడ్లు ఉత్తమంగా సహాయపడతాయి.అంతేకాదు బరువు నిర్వహణలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గించడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కండరాలకు బలాన్ని చేకూర్చడంలో బాతు గుడ్డులో ఉండే పోషకాలు అద్భుతంగా తోడ్పడతాయి.అయితే బాతు గుడ్లలో అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది.అందువల్ల బాతు గుడ్లను రెగ్యులర్ గా తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే బాతు గుడ్లను తీసుకోవడానికి ప్రయత్నించండి.ఇక కొందరికి ఎగ్ అలర్జీ ఉంటుంది.

అలాంటి వారు బాతు గుడ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube