సూర్యాపేట జిల్లా: నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ( Congress party ) అభ్యర్ధి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న,కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామేల్,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నివాసంలో,సాయంత్రం 5.30 గంటలకు హుజూర్ నగర్ మంత్రి నివాసంలో పరిచయ కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు,పట్టభద్రులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.