అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లో అంజీర్( Anjeer ) ఒకటి.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే అంజీర్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచే సత్తా కూడా అంజీర్ కి ఉంది.ముఖ్యంగా అంజీర్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ముడతలు, మచ్చలు లేని మెరిసే ముఖ చర్మం మీ సొంతం అవుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు అంజీర్ లను వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఆ మూడు అంజీర్లలో రెండిటినీ తినేయాలి.
మరొకదాన్ని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న అంజీర్ ప్యూరీలో( Anjeer Puree ) వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, ( Raw Milk ) వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.అంజీర్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ వి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.ఇవి ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఫ్రీ రాడికల్ నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
అకాల వృద్ధాప్యం, గీతలు మరియు ముడతలను నివారిస్తాయి.మీ చర్మాన్ని యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా మెరిపిస్తాయి.
అలాగే అంజీర్ లో విటమిన్ ఎ( Vitamin A ) రిచ్ గా ఉంటుంది.ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.అంజీర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంలోని మొటిమలను, మచ్చలను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి.ఇక రోజుకు రెండు నానబెట్టిన అంజీర్‌లను తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మం సైతం కాంతివంతంగా మెరుస్తుంది.