సూర్యుడిని మార్తాండుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

సూర్య భగవానునికి ఆదివారం ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ సమస్త లోకములు సకల జీవరాసులకు సూర్యుడు ఆధారం అని చెప్పవచ్చు.

 Do-you Know Who Named The Sun Marthandusun, Marthandu, Sunday, Pooja,adhithi,lor-TeluguStop.com

ఆ సూర్యుడే పరబ్రహ్మ స్వరూపుడని, సూర్యుని వల్లే ఈ సృష్టి జరుగుతుందని చెబుతారు.ఈ విధంగా సూర్య భగవానుడుకి ఆదివారం ఎంతో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు.

సూర్యున్ని భానుడు, రవి అనే పేర్లతో కూడా పిలుస్తారు.అదేవిధంగా సూర్యున్ని మార్తాండుడు అని కూడా పిలుస్తారు.

సూర్యుని ఎందుకు మార్తాండుడు అని పిలుస్తారు? ఎవరు ఆ పేరును పెట్టారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Marthandu, Pooja, Sunday-Telugu Bhakthi

పురాణ కథల ప్రకారం అదితి తన గర్భం ద్వారా సూర్యభగవానుడు జన్మించాలని కోరుకొని సూర్యభగవానుడుకి నమస్కరిస్తుంది.ఇందుకోసం కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితి గర్భం దాలుస్తుంది.అయితే అదితి ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఎంతో నీరసించి పోయి ఉన్న ఆమెను చూసి కశ్యపుడు ఆగ్రహించి సంతానం కోసం ఇంత తపించి చివరికి గర్భం పోగొట్టుకున్నావు అంటూ ప్రశ్నించాడు.

దీనికి అదితి తన భర్త తనని పరిహాసం చేస్తున్నాడని కోపగించుకుంటుంది.

అదితి తన భర్తతో మాట్లాడుతూ ఈ గర్భం జారిపోతే ఈ పిండం నుంచి జన్మించే బిడ్డ లోకాలను రక్షించేలా ఉంటాడు అంటూ గర్భాశయం నుంచి అండాన్ని జార విడుస్తుంది.

గర్భం నుంచి పిండం మహా తేజస్సుతో కిందపడడంతో మొదటగా ఆ పిండం మృతి చెందినట్లు కనబడుతుంది.తరువాత కొంత సమయానికి ఆ పిండం నుంచి సువర్ణ కాంతులను ప్రకాశిస్తూ ఒక బాలుడు ఉద్భవిస్తాడు.

ఆ విధంగా బాలుడు జన్మించడంతో ఆదితి తన భర్తను ఉద్దేశించి నాథ అప్పుడు నువ్వు అండంలో ఉన్న బిడ్డని చంపేసావు అన్నావు కదా ఇప్పుడు అండంలోని బిడ్డ కాంతులను విరజిమ్ముతూ జన్మించాడు కాబట్టి ఇతను మార్తాండుడుగా పిలవబడతాడు అని అదితి సూర్యునికి మార్తాండుడు అనే పేరును పెట్టింది.అప్పటినుంచి సూర్యున్ని మార్తాండుడు అని కూడా పిలుస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube