ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు అంటూ ఉంటారు.కానీ మన హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు,వ్రతాలు చేసుకునేటప్పుడు మాత్రం ఉల్లి,వెల్లుల్లి తినటం నిషేధం.
మసాలా లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఆచారాలను నిష్టగా పాటించే వారు పూజల సమయంలోనే కాకుండా మాములు రోజుల్లో కూడా ఉల్లికి దూరంగా ఉంటారు.
అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది.పర్వదినాల్లోనే ఉల్లిని తినకూడదని ఎందుకు నియమాన్ని పెట్టారు? ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారాన్ని సాత్వికం,రాజసికం, తామసికం అని మూడు భాగాలుగా విభజించారు.ఈ ఆహారాలను బట్టి మనిషిలో గుణాలను పెంచటమో తగ్గించటమో చేస్తుంది.ఉల్లి,వెల్లుల్లి,మసాలాలు రాజసికం గుణానికి సంబందించినవి.ఈ ఆహారాలను తీసుకోవటం వలన సరైన ఆలోచనలు రాకపోవటం,ఏకాగ్రత లేకపోవటం,విపరీతమైన కోపం వస్తాయి.
అందువల్ల ఎక్కువ ఏకాగ్రతగా చేసుకొనే పూజలలో ఉల్లి,వెల్లుల్లి,మసాలా వంటి ఆహారాలను నిషేదించారు.అంతేకాక ఉల్లి, వెల్లుల్లి పెరిగే ప్రదేశాలు శుభ్రత లేకుండా ఉంటాయి.
భగవంతుణ్ణి భక్తితో కొలిచే సమయంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవటం తప్పుగా భావిస్తారు.అందుకే పూజలు చేస్తున్న సమయంలో ఉల్లి,వెల్లుల్లి వంటి వాటికీ దూరంగా ఉండమని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.