పవన్ కు సీఎం పదవి ! బాబు ఓకే చెప్పబోతున్నారా ? 

Pawan's Post As CM Babu Is Going To Say The Same Thing,Pavan Kalyan, Telugudesam,AP CM Jagan, Nara Lokesh, Chandrababu,TDP CBN, Ap, Ap Government, Pavan Kalyan, Telugudesam, CBN, Ap, Government, TDP Janasena Aliance, Pavan Kalyan Cm,

ఏపీలో రాజకీయాలు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీ లు,  ఆ పార్టీల నాయకులు రాజకీయ వ్యూహాలను రచిస్తూ దానికి అనుగుణంగా ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం ద్వారా ఏపీ అంతట పర్యటించేందుకు షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.

 Pawan's Post As Cm Babu Is Going To Say The Same Thing,pavan Kalyan, Telugudesa-TeluguStop.com

చంద్రబాబు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పర్యటనలు మొదలుపెట్టారు.ఇక ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ జిల్లా పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు.

దీంతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

వీటి సంగతి ఇలా ఉంటే …జనసేన టిడిపిలో ఇప్పటికే పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు వచ్చేసాయి రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి వైసీపీని ఓడించి తాము అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నాయి.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ముందడుగు వేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వను అని,  దీనికోసం టిడిపి తోనూ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమంటూ ఆయన చేసిన ప్రకటనతో టిడిపిలో ఉత్సాహం కనిపిస్తోంది .అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినా,  సీట్ల విషయంలోనూ ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఇంకా ఏ క్లారిటీ రాలేదు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena Tdp, Lokesh, Pavan Kalyan, Pavan K

అయితే గతం నుంచి పవన్ సీఎం అవ్వాలనే ఆకాంక్షను పదేపదే వ్యక్తం చేస్తున్నారు.పవన్ కు సీఎం పదవి ఇస్తేనే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని ఆ పార్టీ నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు.పవన్ ముఖ్యమంత్రిగా చేసేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి పంచుకుందామనే ప్రతిపాదన తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అసలు జనసేన తో పొత్తు వ్యవహారం మొదలుకాకముందే చంద్రబాబు పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏం చేయాలనే విషయంలో ఒక క్లారిటీతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena Tdp, Lokesh, Pavan Kalyan, Pavan K

ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కాకూడదు అనే లక్ష్యంతో చంద్రబాబు ఉండడంతో,  పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఆయన సానుకూలంగానే ఉన్నారట.పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, ఆయనను తప్పించడం సులువు అవుతుందని,  కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే టిడిపి మరింతగా దెబ్బతింటుందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.అందుకే పొత్తు లో భాగంగా ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ గట్టిగా పట్టుపడితే ఆయనకు ఆ పదవి అయినా ఇచ్చేందుకు సిద్ధమనే ప్రకటన కూడా చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube