అప్పుడు ఆంధ్రావాలా..ఇప్పుడు వాల్తేరు వీరయ్య.. ఒకరే బ్యాడ్ సెంటిమెంట్

మీరు వింటున్నది నిజమే …చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి ఆంధ్రావాలా సెంటిమెంట్ గట్టిగా కొట్టేలా కనిపిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఫ్లాపైన సంగతి మనందరికీ తెలిసిందే.

 Waltair Veerayya Movie Bad Sentiment Like Andhrawala,junior Ntr,andhrawala,walta-TeluguStop.com

అదే దోవలో చిరంజీవి కూడా ప్రయాణిస్తున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.చిరంజీవికి ఎలా ఉందో ఇప్పుడు తెలియదు కానీ ఆయన పి ఆర్ టీమ్ మాత్రం తెగ ఆయాస పడిపోతున్నారు.

జనవరి 13 పేరు చెప్తే చాలు వారి వెన్నుల్లో వణుకు పుడుతుంది.ఇక సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్ని థియేటర్లలో రాబోతోంది, ఓపెనింగ్ ఎలా ఉంటాయి అనే పరిస్థితి లు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఏది ఏమైనా బాలకృష్ణతో మరోసారి కయ్యానికి కాలు దువ్వుతున్న చిరంజీవికి, సినిమా ఓకే అయితే పర్వాలేదు కానీ ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది.

ఇప్పటికే గత రెండు మూడు సినిమాల నుంచి చిరంజీవి ఇమేజ్ డామేజ్ అవుతూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఆచార్య సినిమా ప్రభావం బాగా కొట్టింది.ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ పర్వాలేదనిపించినా భారీ విజయాన్ని అయితే నమోదు చేయలేదు.

Telugu Andhrawala, Chiranjeevi, Ntr, Mythri Makers, Sankranthi, Train, Vizag, Wa

అందుకే ఈసారి వాల్తేరు పరిస్థితి ఆలా ఉండకుండా ఉండాలని వారి పీఆర్ టీమ్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయట.మంచి ఓపెనింగ్స్ వస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా గట్టెక్కచ్చు అని ఆలోచిస్తున్నారట.అటు బాలకృష్ణకి ఇటు చిరంజీవికి ఒకే నిర్మాణ సంస్థ కావడంతో ఎవరిది హిట్ అయినా ఎవరిది ఫట్ అయినా మొదలు నష్టపోయేది మైత్రి వారే.అందుకే ప్రమోషన్స్ మరియు ఇతర విషయాలపై ఎలాంటి డబ్బు ఎంతైనా పర్వాలేదని చెప్తున్నారట.

Telugu Andhrawala, Chiranjeevi, Ntr, Mythri Makers, Sankranthi, Train, Vizag, Wa

ఇక మరొక విషయం ఏమిటంటే చిరంజీవి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ నడపాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారట.వరంగల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి పైగా ఈ స్పెషల్ ట్రైన్ విశాఖకు చేరుతుంది.ఈ ట్రైన్ లో 20 బోగీలో ఉండబోతున్నాయట.ఫాన్స్ అందరు కూడా ఈ ట్రైన్ ద్వారానే వేదిక ఉన్న స్థలానికి చేర్చాలని భావిస్తున్నారట.అయితే గతంలో ఆంధ్రావాలా సినిమాకి కూడా ఇలాగే రైలు నడిపి మరి జనాలను తరలించడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యి డిజాస్టర్ గా మారింది.

అప్పట్లో ఈ ఈవెంట్ కోసం ఏకంగా మూడు ట్రైన్లు పెట్టి నిమ్మకూరు కి ఫ్యాన్స్ అందరిని తరలించి రచ్చ చేశారు.అందుకే మెగాస్టార్ విషయంలో ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా ఉండబోతుందా అని అందరూ అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube