హీరోయిన్స్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్.అలాంటి స్టోరీస్ లో కోలీవుడ్ భామ శృతి హాసన్ ఎప్పుడూ ముందుంటుంది.
అంతకుముందు ఒకరితో పూజలు గట్రా చేసి పెళ్లికి రెడీ అన్నట్టు హడావిడి చేసిన శృతి హాసన్ అతన్ని దూరం పెట్టి ఈమధ్య శాంతాను హజారికతో క్లోజ్ గా ఉంటుంది.దాదాపు వారిద్దరు లవ్ ని చెప్పకనే చెప్పేశారు.
డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతానుతో శృతి హాసన్ చాలా క్లోజ్ గా ఉన్న పర్సనల్ ఫోటోస్ కూడా షేర్ చేసింది.ఇదిలాఉంటే లేటెస్ట్ గా అమ్మడు అతన్ని కూడా దూరం పెట్టేసిందని టాక్.
శృతి హాసన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు కానీ అంతకుముందు శృతి ఎక్కడ ఉంటే అక్కడ శాంతాను కనిపించేవాడు.
కానీ ఇప్పుడు శృతి మాత్రం ఎక్కడ చూసినా సింగిల్ గానే కనిపిస్తుంది.
శృతి హాసన్ ప్రస్తుతం చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా తో పాటుగా వీర సింహా రెడ్డిలో కూడా నటిస్తుంది.
శృతి నిజంగానే బ్రేకప్ చేసిందా.శాంతాను తో విడిపోవడానికి కారణాలు ఏంటి.
ఇంతకీ అమ్మడు ఏం ఆలోచిస్తుంది అన్నది తెలియాలంటే శృతి హాసన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.