జేమ్స్ కామెరూన్. ప్రపంచం దుర్ష్టిని మొత్తం తనవైపు తిప్పుకున్న దర్శకుడు.
అవతార్ 2 సినిమాతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే అతడి జీవితం పూల పాన్పు ఏమి కాదు.
సినిమా ను మించిన కష్టాలు అతడి జీవితంలో ఉన్నాయి.చిన్నతనంలో చదువుల్లో ఎప్పుడూ వెనకే ఉండేవాడు కానీ ల్యాబ్ లో ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం.
తల్లి చెప్పే కథలను వింటూ పెరిగాడు క్రమంగా తల్లి నుంచి పుస్తకాలు చదవడం కూడా అలవాటయింది.తద్వారా సైన్స్ ఫిక్షన్ పై ఆసక్తి పెంచుకున్నాడు.
అందుకే ప్రస్తుతం ప్రపంచం మెచ్చిన దర్శకుడు అయ్యాడు.కెనడాలోని అత్యంత మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జేమ్స్ తండ్రి ఇంజనీర్, అందుకే తన కొడుకును కూడా ఇంజనీర్ చేయాలనుకున్నాడు.
కానీ కామెరూన్ కి చదువులపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.అలాగే తండ్రిలా ఉద్యోగం చేయాలనే కూడా ఆసక్తి లేకపోవడంతో తల్లిదండ్రులకు భారం కాకూడదని టాక్సీ డ్రైవర్ గా మారాడు.
కానీ తల్లికి తన కొడుకు అలా డ్రైవర్ గా మారడం ఇష్టం లేదు ఆ పని వద్దంటూ ఎప్పుడు చెప్తూ ఉండేది కానీ అతడు వినేవాడు కాదు.తన తల్లి చిన్నతనంలో చెప్పిన కథలను ఒక పుస్తకంలా రాసుకున్నాడు కామెరూన్.
డ్రైవింగ్ చేస్తున్న క్రమంల మెదడులో ఎలాంటి ఆలోచన వచ్చిన సరే పక్కకు బండి ఆపి మరీ అవి రాసుకునేవాడు.అతడి వైఖరి చూసి అందరూ వింతగా చూసేవారు.
అతనికి పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకునేవారు.

స్టార్ వార్స్ వారి సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలనుకున్నాడు.అవకాశాల కోసం రెండు మూడేళ్లు కాళ్ళు అరిగేలా తిరిగాడు.ఎలాగోలా మొదట అవకాశం వచ్చింది కానీ వారం కూడా పనిచేయకుండానే అతడికి ఆ పని పోయింది, తన స్థానంలో మరొక దర్శకుడికి అవకాశం ఇచ్చారు.
తనకు అవకాశం ఇవ్వకపోయినా అదే సంస్థలో ఉన్నాడు కామెరూన్. అక్కడే ఉంటూ సినిమాలు ఎలా తీస్తున్నారో ప్రొడక్షన్ పనులు అన్ని చూస్తూ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా మారాడు.
ఆ తర్వాత ఫిరానా 2 అనే సినిమాకి సదరు నిర్మాణ సంస్థ ప్లాన్ చేయగానే తాను ఆ సినిమాను చేయడానికి పూనుకున్నాడు.అలా తనకు వచ్చిన మొదటి అవకాశాన్ని జేమ్స్ కామెరూన్ చక్కగా వినియోగించుకున్నాడు.
తన ప్రాణం పెట్టి ఆ సినిమాను తీశాడు అంతేకాదు.

ఆ చిత్రం విడుదలైన తర్వాత ప్రభంజనం సృష్టించింది.దాంతో కామెరూన్ పై అందరి దృష్టి పడింది.సాహసాలు చేయడం, ఈత కొట్టడం, నీళ్లు అంటే ఎంతో ఇష్టం కామెరూన్ కి.అందుకే జియోగ్రఫీ చానల్లో కొన్ని డాక్యుమెంటరీ తీశాడు.అప్పుడే టైటానిక్ సినిమాకి బీజం పడింది.అట్లాంటిక్ మహాసముద్రం దిగివకు ఎన్నోసార్లు డైవ్ చేసాడు.అది టైటానిక్ సినిమాకు పని చేయడానికి ఊతమిచ్చింది.ఇక సినిమా తీసే క్రమంలో కామెరూన్ తన చిత్రంలో నటించే నటులతో ఎంతో దురుసుగా ప్రవర్తిస్తారు.అందుకే ఒకసారి పని చేసిన వారు ఎవరైనా కూడా మళ్లీ అతనితో కలిసి నటించాలంటే ఇష్టపడరు.
టైటానిక్ నటి కేన్ విన్స్లెట్ మరోసారి కామెరూన్ తో నటించే అవకాశం లేదంటూ మొహం పైనే చెప్పిందట.

1999లోనే అవతార్ సినిమా కథకు మొదట బీజం పడింది కానీ అప్పుడున్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా కొంతకాలం ఆగాడు.ఆ తర్వాత అవతార్ సినిమా తీయాలంటే పెట్టాల్సిన ఖర్చు గురించి అనేక నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగిన ఎవరూ ముందుకు రాలేదు.కానీ తనకున్న ఆస్తులను మొత్తం అమ్మేసి, అప్పులు చేసి మరి అవతార్ సినిమా తీయగా అది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద సినిమాగా అవతరించి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.
కామెరూన్ కి హిందూ దేవుళ్ళు అంటే మంచి విశ్వాసం ఉంది.అతడు రాముడు, కృష్ణుడిని ఆరాధిస్తాడట.వాటిని ఆధారం చేసుకుని అవతార్ సిరీస్ లు కూడా తెరకెక్కిస్తున్నాడు.








