కరోనా వైరస్.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపించి కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని ఆపేసింది.కరోనా వైరస్ ఎందరో జీవితాలను నాశనం చేసి పడేసింది.అలాంటి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేక వ్యాపించుకుం టూ ఎందరో ప్రాణాలను తీసింది.ఇక ఈ నేపథ్యంలోనే త్వరలోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లు రానున్నాయ్.కానీ ఈ కరోనా వైరస్ ప్రభావం మాత్రం రాబోయే నాలుగు సంవత్సరాలు ఉండునున్నట్టు హెల్త్ ఆర్గనైజషన్లు కూడా చెప్తున్నాయ్.
ఇంకా ఈ నేపథ్యంలోనే క్లోర్‌హెక్సిడైన్ మౌత్‌వాష్‌తో కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రచారం జరుగుతుంది.సాధారణంగా మనం ఉపయోగించే క్లోర్‌హెక్సిడైన్ మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను అదుపు చెయ్యడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు ప్రయోగాల్లో తేలింది.
పంజాబ్ యూనివర్సిటి కి చెందిన డాక్టర్ హెచ్‌ఎస్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, సీఎస్‌ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
కరోనా వైరస్ ముక్కు, గొంతులో మొదట చేరుతుందని ఆతర్వాత శరీరంలోకి వ్యాపిస్తుంది అని చెప్పారు.అయితే ఈ మౌత్ వాష్ తో నోరు కడుక్కుని పుక్కలిస్తే అది గొంతులోనే చచ్చిపోతుంది అని దానితోనే కరోనా వైరస్ నిర్ములించవచ్చని ఆ పరిశోధకులు చెప్తున్నారు.ఈ క్లోర్‌హెక్సిడై న్ డైగ్లూకోనేట్ మౌత్‌వాష్ 0.2% కాన్సెంట్రేషన్‌తో కేవలం 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేసుకుంటే 99.9 శాతం కరోనా వైరస్ ను అంతం చెయ్యచ్చని పరిశోధకులు చెప్తున్నారు.ఇంకా దీనిపై క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.కేవలం మౌత్ వాష్ మాత్రమే కాకుండా గోరు వెచ్చని నీళ్లతో పుక్కలించిన మంచి ఫలితం ఉంటుంది అని వైద్యులు కరోనా వైరస్ ఆరంభ దశలోనే చెప్పారు.