మెంతులు.( Fenugreek Seeds ) వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే పోపు దినుసుల్లో మెంతులు ఒకటి.రుచికి చేదుగా ఉన్నా కూడా మెంతుల్లో పోషకాలు మాత్రం అంతులేని విధంగా ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి.అలాగే కురులకు( Hair ) కొండంత అండగా ఉంటాయి.జుట్టు సమస్యలన్నిటికీ సమర్థవంతంగా చెక్ పెడతాయి.అందుకోసం మెంతులు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వాటర్ తో ఒకటి లేదా రెండుసార్లు వాష్ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి,( Hibiscus Powder ) ఒక ఎగ్ వైట్,( Egg White ) రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించు షవర్ క్యాప్ ధరించాలి.గంట తర్వాత తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ సింపుల్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.ప్రధానంగా మెంతులు, ఎగ్ వైట్, మందారం, కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి.
జుట్టు రాలడాన్ని అరికడతాయి.కురులు ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను తరిమి కొడతాయి.అలాగే మెంతులతో ఈ మాస్క్ వేసుకోవడం వల్ల పొడి జుట్టు రిపేర్ అవుతుంది.
కురులు సిల్కీ గా మరియు షైనీ గా సైతం మారతాయి.