పనస గింజలను ఎలా తినాలి.. అవి అందించే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఇష్టంగా తినే పండ్లలో పనస( Jackfruit ) ఒకటి.అయితే పనస పండును తినే క్రమంలో గింజలను పక్కన పారేస్తుంటారు.

 How To Eat Jackfruit Seeds Do You Know What Benefits They Provide Details, Jack-TeluguStop.com

కానీ పనస గింజలు( Jackfruit Seeds ) కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అనేక లాభాల‌ను చేకూరుస్తాయి.

ఈ నేప‌థ్యంలోనే ప‌న‌స‌ గింజలను ఎలా తినాలి.? అవి అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న‌స గింజ‌ల్లో ప్రోటీన్, ఫైబ‌ర్‌, రిబోఫ్లావిన్, థ‌యామిన్, ఐరన్, కాల్షియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

ప‌న‌స గింజ‌ల‌ను పారేస్తే ఈ పోష‌కాల‌న్నిటినీ మీరు కోల్పోయిన‌ట్లే.ప‌న‌స గింజ‌ల‌ను అనేక విధాలుగా తినొచ్చు.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ప‌స‌న గింజ‌ల‌ను ఉడికించి తినొచ్చు.కుర్మా క‌ర్రీకి ఉప‌యోగించ‌వ‌చ్చు.

అలాగే ప‌న‌స గింజ‌ల‌ను కాల్చి తిన్నా కూడా చాలా రుచిక‌రంగా ఉంటాయి.

Telugu Eye, Tips, Jackfruit, Jackfruit Seeds, Jackfruitseeds, Latest, Proteins,

ఇక ప‌న‌స‌ గింజ‌ల ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.వీటిలో పుష్క‌లంగా ఉండే మెగ్నీషియం కాల్షియం శోషణకు సహాయపడుతుంది.ఎముకలను బలపర‌చ‌డానికి( Strong Bones ) మ‌ద్ధ‌తు ఇస్తుంది.

అలాగే ప‌న‌స గింజ‌ల్లో ఫైబర్ మరియు రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటాయి.ఇవి జీర్ణక్రియను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

మ‌ల‌బద్ధ‌కం( Constipation ) స‌మ‌స్య‌ను త‌రిమికొడ‌తాయి.ప‌న‌స గింజ‌ల్లో విటమిన్ ఎ ఉంటుంది.

ఇది దృష్టి లోపాల‌ను నివారించడంలో సహాయపడుతుంది.

Telugu Eye, Tips, Jackfruit, Jackfruit Seeds, Jackfruitseeds, Latest, Proteins,

ప‌న‌స గింజ‌ల్లో కరిగే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి మానసిక ఒత్తిడి మరియు ఆందోళన వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.మెద‌డు ప‌నితీరును పెంచుతాయి.

అంతేకాకుండా, ప‌న‌స గింజ‌ల‌ను డైట్ లో చేర్చుకుంటే అతి ఆక‌లి త‌గ్గుతుంది.శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య పరార్ అవుతుంది.ప‌న‌స గింజ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చ‌ర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ముడతలు, మచ్చలకు చెక్ పెడ‌తాయి.యూత్ ఫుల్ స్కిన్ ను మీసొంతం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube