1.భారత్ కు మరిన్ని విమాన సర్వీసులు

ఇండియాకు తన కార్యకలాపాలను బెహ్రైన్ జాతీయ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేసింది.దీనిలో భాగంగా ఈ వేసవిలో 90% సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
2.కాల్పుల కలకలం
సౌత్ కరోలినా లోని కొలంబియా లో కాల్పులు చోటు చేసుకున్నాయి.స్థానికంగా ఉండే ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఈ పార్కులో 12 మంది గాయపడ్డారని కొలంబియా పోలీసులు వెల్లడించారు వెల్లడించారు.
3.బెహ్రైన్ లో బాల్కొండ వాసి మృతి
బతుకుతెరువు కోసం బెహ్రైన్ దేశం వెళ్ళిన తెలంగాణ లోని బాల్కొండ వాసి తూడుం శ్రీనివాస్ (45) అక్కడే గుండెపోటుతో మృతి చెందారు.
4.బ్రిటన్ ప్రధాని పై రష్యా నిషేధం

రష్యాలోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అనుమతి లేదంటూ రష్యా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది.
5.ఎన్నారై టిడిపి యూరోప్ టీమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎన్నారై తెలుగుదేశం యూరోప్ టీం కిషోర్ చలసాని ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
6.మరో భారతీయ అమెరికన్ కు కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తన టీం లో చేర్చుకున్నారు.భారత సంతతి మహిళ సచ్ దేవా కొర్హో నెన్ ను మాలిలో యూఎస్ రాయబారిగా నియమించారు.
7.సెల్కాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో రాజ్ నాథ్ సింగ్ భేటీ

అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీని గురువారం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి భారతీయులతో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు.