కంటి చూపుకు అండగా నిలిచే ఈ 8 ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకోండి!

ఇటీవల రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిలో కంటి చూపు( eye sight ) తగ్గిపోతుంది.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, మొబైల్ ఫోన్లు.

 8 Foods For Improving Eyesight! Eyesight, Eyesight Improving Foods, Latest News,-TeluguStop.com

టీవీలు అధికంగా చూడడం, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని గేమ్స్ ఆడటం తదితర కారణాల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.క్రమంగా కంటి చూపు మందగిస్తుంది.

దాంతో కళ్ళద్దాలపై ఆధారపడుతున్నారు.ఈ జాబితాలో మీరు ఉండకూడదు అనుకుంటే ఖ‌చ్చితంగా కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఎనిమిది ఫుడ్స్ అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ 8 ఫుడ్స్ ఏంటి.

అవి మీ డైట్ లో ఉన్నాయా లేదా అనేది ఓ చూపు చూసేయండి.

Telugu Foods, Tips, Latest-Telugu Health

వాల్ నట్స్( Wall nuts ).వీటి ఖరీదు కాస్త ఎక్కువ అయినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.

రోజుకు ఐదు వాల్ నట్స్ ను వాటర్ లో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.ఇలా చేస్తే కంటి చూపు తగ్గడం కాదు రెట్టింపు అవుతుంది.

కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పాలకూర ఒకటి.పాలకూర( Lettuce ) కంటిచూపును పెంచడమే కాదు కంటి సంబంధిత సమస్యలెన్నిటినో అడ్డుకుంటుంది.

అవకాడో( Avocado ).కంటి చూపును మెరుగు పరచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.రోజుకు ఒక అవకాడో ను తీసుకుంటే వయసు పైబ‌డిన సరే చూపు చక్కగా కనిపిస్తుంది.

Telugu Foods, Tips, Latest-Telugu Health

చేపలు.మెదడును చురుగ్గా మార్చడానికే కాదు కంటి చూపును కూడా రెట్టింపు చేస్తాయి.అందుకే వారంలో కనీసం ఒకటి లేదా రెండు సార్లు చేపలు తీసుకోవాలి.

కంటి చూపుకు అండగా నిలిచే ఆహారాల్లో క్యారెట్ ఒకటి.రోజుకు ఒక క్యారెట్ తింటే కళ్ళద్దాల అవసరమే ఉండదు.

చిలకడదుంపలు( sweet potatoes ).వీటిని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు.కానీ కంటి ఆరోగ్యానికి చిలకడదుంపలు ఎంతో మేలు చేస్తాయి.ఉడికించిన చిలకడదుంపల‌ను తరచూ తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.కంటి చూపును పెంచే ఆహారాల్లో బ్రోకలీ ఒకటి.బ్రోకలీ లో విటమిన్ ఏ రిచ్ గా ఉంటుంది.

అందుకే బ్రోక‌లీని వారానికి కనీసం మూడుసార్లు అయినా తీసుకోవాలి.ఇక‌ స్ట్రాబెర్రీ పండ్లు కూడా కంటి చూపును అద్భుతంగా పెంచుతాయి.

కాబట్టి కళ్ళు చక్కగా కనిపించాలి అనుకుంటే ఖ‌చ్చితంగా ఈ ఎనిమిది ఆహారాలను డైట్ లో ఉండేలా చూసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube