పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.
అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ టూర్ లో బిజీ అయ్యాడు.దీంతో ఈయన సినిమా షూట్స్ అన్ని తాత్కాలికంగా నిలిచి పోయాయి.అయినా కూడా పవన్ కళ్యాణ్ మేకర్స్ మాత్రం షూట్ ఆపలేదు.ఆయన లేని పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
ఇక ఉస్తాద్ షూట్ విషయానికి వస్తే ఇది మాత్రం ప్రస్తుతం ఆగిపోయినట్టే కనిపిస్తుంది.ఈ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈ మధ్యనే అఖిల్ ఏజెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సాక్షి వైద్య( Sakshi Vaidya ) అన్నట్టు టాక్.
దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ తో ఇద్దరు యంగ్ బ్యూటీలు ఆడిపాడబోతున్నారు అనమాట.చూడాలి ఈ ఇద్దరు ఎలా ఆకట్టు కుంటారో.ఇప్పటికే శ్రీలీల లుక్ ను హరీష్ రివీల్ చేసిన విషయం విదితమే.ఆ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.