యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas) నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్( Adipurush) జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కొన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మిశ్రమ స్పందన రాగా టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ తో అదరగొట్టింది.ఓపెనింగ్స్ మాత్రమే కాదు.మూడు రోజుల పాటు డార్లింగ్ బాక్సాఫీస్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు.
కానీ ఆ తర్వాతనే అసలు పరీక్ష మొదలైంది.సోమవారం నుండి ఆదిపురుష్ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి.
మొదటి మూడు రోజల్లోనే 340 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

అయితే ఆ తర్వాత రెండు రోజులు భారీగా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడంతో ఇప్పటి వరకు కేవలం 400 కోట్ల దగ్గరే ఆగిపోయింది.మరి ఈ సినిమా వీక్ డేస్ కావడంతో భారీగా కలెక్షన్స్ పడిపోయి కలెక్షన్స్ ముందుకు వెళ్లకపోవడంతో ఆదిపురుష్ మేకర్స్( Adipurush Makers ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు రేపు అంటే జూన్ 22 అండ్ 23న ఈ సినిమా టికెట్ రేట్ కేవలం 150 రూపాయలు మాత్రమే అని ప్రకటించారు.
దీంతో 3డి వర్షన్ కేవలం 150 మాత్రమే అని చెప్పడం వీక్ డేస్ లో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి కాస్త కలెక్షన్స్ పడిపోకుండా చేయడం కోసమే అని తెలుస్తుంది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.
ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అంటే సౌత్ లో ఈ టికెట్ రేట్స్ తగ్గించలేదు.కేవలం హిందీ బెల్ట్ కోసమే ఇలా చేసినట్టు తెలుస్తుంది.








