రోల్స్ రాయిస్ నుంచి త్వ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ ఫ్లైట్స్‌.. దాని వేగం తెలిస్తే..

ఇటీవల కాలంలో ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.జనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 Electric Flights From Rolls Royce Soon If You Know Its Speed, Rolls Royce, Elect-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేకింగ్‌పై దృష్టి సారిస్తున్నాయి.యూకేకు చెందిన ఆటోమొబైట్ కంపెనీ రోల్స్ రాయిస్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పూనుకుంది.

ఈ కంపెనీ త్వరలోనే ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురానుంది.ఈ కంపెనీకి చెందిన కార్లు ధనవంతులకు బాగా ఇష్టం.

కాగా, రోల్స్ రాయిస్ ప్రజెంట్ తేలికపాటి విమానాలను తయారు చేస్తోంది.అయితే, తొలుత సింగిల్ సీటర్ విమానాలను తీసుకురాబోతున్నది.

ఈ తేలికపాటి విమానం ఎలక్ట్రిక్ ఫ్లైట్.అనగా విద్యుత్ ఆధారంగా ఈ విమానం ఎగురుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్ల మాదిరిగా ఎలక్ట్రిక్ ఫ్లైట్ రాబోతున్నది.ఇప్పటికే ఈ ఫ్లైట్‌ను కంపెనీ వారు టెస్టు చేయగా, టెస్టు సక్సెస్ అయింది.

రోల్స్ రాయిస్ కంపెనీ జెట్ ఫ్లైట్స్‌కు ఇంజిన్లను కూడా తయారుచేస్తుంటుంది.తాజాగా ఎలక్ట్రిక్ ఫ్లైట్ అనగా తేలికపాటి విమానం కూడా తయారు చేసింది.

ఈ తయారీకిగాను రోల్స్ రాయిస్ కంపెనీకి ‘ది స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ అనే గుర్తింపు లభించింది.ఈ ఎలక్ట్రిక్ ఫ్లైట్ 15 నిమిషాలలోనే గాలిలోకి ఎగరగలదు.

Telugu Milesspeed, Rolls Royce, Rollsroyce, Seaterelectric, Spirit-Latest News -

టేకాఫ్ అయిన తర్వాత గరిష్ట వేగం అందుకున్నాక గంటకు 300 మైళ్ల వేగంతో ప్రయాణించగలదని, ఇందుకు సంబంధించిన ట్రయల్ టెస్టింగ్ సక్సెస్ ఫుల్ అయినట్లు రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఏవియేషన్ సెక్టార్ అనగా విమాన రంగంలో విద్యుత్ వినియోగం పట్ల పలువురు ఇండస్ట్రీ నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.విమాన ఇంధనాల భారీ వినియోగం వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతున్నదని పేర్కొంటున్నారు.కర్బన ఉద్గారాలను తగ్గింపు కోసం ఆల్టర్నేట్ వే గా ఎలక్ట్రిక్ ఫ్లైట్ యూసేజ్ మంచిదేనని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube