మ‌ధుమేహుల‌కు చియా సీడ్స్ ఓ వ‌రం..షుగ‌ర్ కంట్రోల్ కోసం ఇలా తీసుకోండి!

చియా సీడ్స్.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

 How Should Diabetics Take Chia Seeds? Diabetes, Chia Seeds, Chia Seeds Benefits,-TeluguStop.com

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే విత్త‌నాల్లో చియా సీడ్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటి విన‌యోగం కూడా అత్య‌ధికంగా ఉంది అనండంలో ఎటువంటి సందేమం లేదు.

ఇక మ‌ధుమేహుల‌కు చియా సీడ్స్ ఓ వ‌ర‌మనే చెప్పొచ్చు.షుగ‌ర్ కంట్రోల్ ద‌గ్గ‌ర నుండి వెయిట్ లాస్ వ‌ర‌కు అనేక విధాలుగా చియా సీడ్స్ మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంత‌కీ చియా సీడ్స్‌ను మ‌ధుమేహం ఉన్న వారు ఎలా తీసుకోవ‌చ్చో ఓ చూపు చూసేయండి.

ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ వాట‌ర్‌లో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ ఆపిల్ సైడర్ వెనిగర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, గ్లాస్ గోరు వెచ్చ‌ని వాటర్ వేసుకుని బాగా క‌లిపి సేవించాలి.

మార్నింగ్ టైమ్‌లో చియా సీడ్స్‌ను ఈ విధంగా తీసుకుంటే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది.బాడీ డిటాక్స్ అవుతుంది.చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.

Telugu Sugar Levels, Chia Seeds, Chiaseeds, Diabetes, Diabetic, Tips, Latest-Lat

అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు త‌ర‌చూ నీర‌సం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే నీర‌సాన్ని త‌రిమి కొట్ట‌డంలో చియా సీడ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డతాయి.అందుకోసం బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

అలాగే ఒక క‌ప్పు యాపిల్ ముక్క‌లు, ఒక క‌ప్పు సోయా పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్‌, హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్, అర క‌ప్పు వాట‌ర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే.టేస్టీ స్మూతీ రెడీ అవుతుంది.

బ్రేక్ ఫాస్ట్‌లో ఈ స్మూతీని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.నీర‌సం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

మ‌రియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఇక మ‌ధుమేహం ఉన్న వారు చియా సీడ్స్‌ను స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు.

గోధుమలతో కలిపి ఉడికించి తినవచ్చు.ఓట్ మీల్ లో కలుపుకుని తీసుకోవ‌చ్చు.

ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డానికి సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube