ఓవైపు కరోనా వైరస్‌తో అల్లాడి పోతున్న ప్రజలను మరోవైపు బ్లాక్ ఫంగస్ ముప్ప తిప్పలు పెడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.బ్లాక్ ఫంగస్ కేసులతో సతమతమవుతుంటే మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది.
కరోనా రోగుల్లో వైట్ ఫంగస్‌ను తాజాగా వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే.స్టెరాయిడ్స్ అధికంగా తీసుకున్న వారిని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిని, మధుమేహం ఉన్న వారిని, తదితర వ్యాధులతో బాధ పడే వారిని ఈ ఫంగస్ ఈజీగా ఎటాక్ చేస్తుంది.
ఈ వైట్ ఫంగస్ కేవలం ఊపిరితిత్తులనే కాకుండా, గోళ్లు, చర్మం, పొట్ట, జననాంగాలు, మూత్రపిండాలు, మెదడు, నోరు మొదలైన శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైన ఈ వైట్ ఫంగస్‌ను ముందుగా గుర్తించకుంటే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.
మరి ఈ వైట్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి దీని లక్షణాలు ఏంటీ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ ఫంగస్ లక్షణాలు సైతం కరోనా వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి.శ్వాస కోశ సమస్యలు ఏర్పడటం, ఛాతి నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర దగ్గు వంటి లక్షణాలతో పాటుగా శరీరంలో వాపు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి.ఈ లక్షణాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి.
ఒక వేళ కరోనా టెస్ట్‌ల్లో నెగటివ్ వస్తే.వెంటనే వైద్యులను సంప్రదించి ఎక్స్‌రే లేదా చెస్ట్ స్కాన్ చేయించుకోవాలి.వీటి ద్వారా వైట్ ఫంగస్ ను గుర్తించవచ్చు.ముందుగానే ఈ వైట్ ఫంగస్‌ను గుర్తిస్తే.
యాంటీ ఫంగల్ మందుల ద్వారా బయట పడొచ్చు.లేట్ చేసే కొద్ది శరీర అవయవాలు దెబ్బ తిని.
ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.