ముల్లోకాలకి అధిపతి, అభిషేక ప్రియుడు అయిన పరమ శివుని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.అదే విధంగా మన దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ శైవ క్షేత్రాలు మనకు పెద్దఎత్తున దర్శన మిస్తుంటాయి.
ఈ విధంగా భక్తుల కోరికలను తీరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుడు రోజు తెల్లవారు జామున మానస సరోవరం వద్ద స్నానమాచరిస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు.హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం ఆ బ్రహ్మ సృష్టి అని భావిస్తారు.
కొన్ని వందల చదరపు అడుగులు వైశాల్యం ఉన్న మానస సరోవరాన్ని చుట్టి రావాలంటే అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు.ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ సరస్సులో దేవ దేవతలు వారి తేజోరూపంలో వచ్చే స్నానాలాచరిస్తారని చెబుతారు.
ఈ సరస్సులోని నీరు ఎల్లప్పుడు ఎంతో స్వచ్ఛంగా, తియ్యగా ఉంటాయి.సాక్షాత్తు దేవ గంగ, ఇంద్రాద్రి వంటి దేవతలు తిరిగాడిన చోటనే చెబుతుంటారు.
మానససరోవరంలోని నీరు సూర్యా స్తమయంలో, సూర్యోదయ సమయంలో ఎంతో ఆహ్లాద కరంగా, అందంగా ఉంటాయి.క్షణక్షణం రంగులు మారుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.

మన పురాణాల ప్రకారం ఈ పర్వతం ఎంతో ప్రసిద్ధి చెందినది అని చెప్పవచ్చు.ఆ పరమేశ్వరుడు ఈ పర్వతం పై ఉండి ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాడు.అదే విధంగా జగదాంబ, పార్వతి దేవి వారికున్న అమోఘమైన శక్తి చేత సమస్త సృష్టిని కాపాడుతారు.ఈ పర్వతాన్ని శ్రీ చక్ర పర్వతం అని కూడా పిలుస్తారు.
ఇది జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా భావిస్తుంటారు.మానస సరోవరం అధిరోహించాలి అంటే అంత సులువైన విషయం కాదు.
ఎంతో కష్టంతో కొడుకుని ఈ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది.ఆరోగ్యం కుదటగా ఉండి,ఆర్థిక ఇబ్బందులతో, జర సమస్యలతో సతమతమయ్యేవారు ఈ పర్వతాన్ని అధిరోహించాలి.
ఇక్కడ స్నానమాచరించినచో ఆత్మ శాంతి కలుగుతుంది.జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ మానస సరోవరం అధిరోహించాలని చెబుతుంటారు.
ఈ విధంగా ఈ సరోవరం దర్శించిన వారిపై పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తుంటారు.