కాస్త పసుపుతో ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు..

మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు పసుపుకు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు.వంటగది నుంచి దేవుడి గది వరకు అన్ని అవసరాలకు పసుపును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

 If You Do This With A Bit Of Turmeric, Good Luck Will Not Leave You Anywhere , T-TeluguStop.com

చాలా మంది ముఖ్యంగా పసుపును ఎంతో పవిత్రంగా భావిస్తారు.చాలామంది ప్రజలు వారి ఇళ్లలో జరుపుకునే ప్రతి శుభకార్యానికి పసుపును ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అదృష్టాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది కాబట్టి దీని ప్రభావం వల్ల ఇది వ్యక్తులపై ఎక్కువగా దీని ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుందని పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు.

పసుపుతో ఏం చేస్తే ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యుల వివాహానికి ఆటంకాలు ఎదురవుతుంటే ఆ సమస్య తొలిగిపోవడానికి ప్రతి గురువారం రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించడం మంచిది.

ఈ సమయంలో గణేశుడికి చిటికెడు పసుపును సమర్పించాలి.ఇలాగ పూజ చేయడం వల్ల గణేశుడు సంతృప్తి చెంది సదరు వ్యక్తి జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడని ప్రజలు నమ్ముతారు.

అంతేకాకుండా ప్రతిరోజు దేవుడి పూజలో పసుపును సమర్పించి దానిని ప్రసాదంగా భావించి తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుందని, వివాహానికి వచ్చే అడ్డంకులు దూరం అవుతాయని చెబుతూ ఉంటారు.

Telugu Astrologers, Bakti, Bath Turmeric, Devotional, Ganapati, Luck, Turmeric-L

ఏ వ్యక్తి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉండడం వల్ల కష్టాలు ఎదురవుతున్నాయో దీని కారణంగా ఆనందం అదృష్టం తగ్గుతున్నాయని భావిస్తే ప్రతిరోజు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జీవితంలో పెద్ద మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇంట్లో సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని మీకు అనిపిస్తే ప్రతి గురువారం ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపి గంగాజలాన్ని చల్లడం మంచిది.

ఈ పరిహారం చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని కూడా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube