ఈ బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడికి( Stress ) గురవుతూ ఉంటారు.ఈ విషయంలో పిల్లల నుంచి పెద్దవారి వరకు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.
ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపద కోరుకుంటుంటారు.అందుకే ప్రతి ఒక్కరూ సులభమైన పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు.
అలాంటి వాటిలో ముఖ్యమైనవి వెదురు మొక్క.ఇలాంటి మొక్కలు ఇంట్లోనూ ఇంటి ఆవరణలోనూ పెంచుకోవాలి.
ఏ దిక్కులో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి.వంటి విషయాలన్నీ కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.

అయితే లక్కీ మొక్కలలో చిన్న వెదురు మొక్క( Bamboo )లకు ప్రత్యేక స్థానం ఉంది.వీటిని ఇంట్లో అందంగా అలంకరించడానికి మాత్రమే కాదు.ఈ మొక్క భాగ్యోదయానికి కూడా ఆ కారణం అవుతుంది.అందుకే ఇప్పుడు యువత కూడా చాలామంది లక్కీ బేంబూ ను నమ్ముతున్నారు.చాలామంది ఈ మొక్కను చూస్తున్నప్పుడు తమలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్కను చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వెదురు మొక్క చిన్నగా కనిపించిన దాని ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.ఈ ముక్క ధర 200 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది.
ఇవి మూడు నుంచి నాలుగు అడుగుల పొడవైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి.

దీనికి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు.నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్ళిపోతుంది.వాతావరణాన్ని అనుసరించి దీని పోషణలో మార్పులు చేసుకోవాలి.
అప్పుడప్పుడు ఎరువు కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది.ఈ మొక్క పై నేరుగా సూర్య కాంతి( sun light ) పడకుండా జాగ్రత్త పడాలి.
ఈ మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయిన, కుళ్ళిపోయిన ఆ భాగాన్ని తొలగించాలి.వెదురు మొక్కను పంచభూతాలకు ప్రతికగా చాలామంది భావిస్తారు.
ఇది ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు తొలగిపోతాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు.ఈ మొక్కలోని కాండాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
కాబట్టి కుటుంబంలో ప్రేమాభిమానాలు, అనుబంధాలు బలపడతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాగే ఇది ఇంట్లో పెంచుకోవడం అదృష్టంగా భావిస్తారు.