ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ( YCP ) మరియు జనసేన పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.పోలీస్ యంత్రాంగం లేకపోతే ఇరువురి పార్టీల అభిమానులు నడి రోడ్డు మీద గొడవలు పెట్టుకునేలా ఉన్నారు.
ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఈ ఇరువురి పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి.ఇలాంటి వాతావరణం ఉన్న సమయం లో మీరెవ్వరు గమనించని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
అప్పట్లో పవన్ కళ్యాణ్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ని దేవుడి లాగ, చంద్రబాబు నాయుడు ని మరియు కేసీయార్ లను విలన్స్ గా చూపిస్తూ తీసిన సినిమాలో హీరో గా నటించాడు.ఈ సినిమా అప్పట్లో పెద్ద వివాదాలకు దారి తీసింది.

ఆ సినిమా మరేదో కాదు, పూరి జగన్నాథ్( Puri Jagannath ) దర్శకత్వం లో వచ్చిన కెమెరా మెన్ గంగతో రాంబాబు( Cameraman Gangatho Rambabu ).గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే చేసిన పొలిటికల్ డ్రామా ఇది.ఇందులో కోట శ్రీనివాస రావు ( Kota Srinivasa Rao )పాత్ర ని చంద్రబాబు నాయుడు పాత్ర తో పోలుస్తూ తెరకెక్కించారని అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ అయ్యింది.అలాగే నాజర్ పాత్ర ని వేషధారణ తో సహా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని డిజైన్ చేసిన క్యారక్టర్ లాగా అనిపించింది.
ఇక కేసీయార్ ని అయితే డైరెక్ట్ గానే ట్రోల్ చేసినట్టుగా అనిపించింది.ఈ పాత్ర ప్రకాష్ రాజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.తెలంగాణ ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో తెలంగాణ లో బ్యాన్ చేసారు.నాలుగు రోజుల పాటు ఈ సినిమా షోస్ తెలంగాణ లో ఎక్కడా పడలేదు.

అయినప్పటికీ కూడా ఈ సినిమా ఫ్లాప్ తో అప్పట్లో అబొవె యావరేజ్ రేంజ్ వసూళ్లను రాబట్టింది.సుమారుగా 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలంగాణ ప్రాంతం లో 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఆ నాలుగు రోజులు తెలంగాణ లో ఈ సినిమాకి ఆపి ఉండకపొయ్యుంటే మరో మూడు కోట్ల రూపాయిల షేర్ అదనంగా వచ్చి ఉండేది.ఇప్పుడు ఈ సినిమాని ఈ పొలిటికల్ హీట్ వాతావరణం లో మరోసారి రీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.







