వచ్చే అసెంబ్లీ ఎన్నికలు విశాఖ నుండే...!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి( CM Jagan ) మరో సారి విశాఖ రాజధాని గురించి ప్రస్తావించారు.ఇటీవల ఒక మీటింగ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో తాను విశాఖపట్నం కి( Vishakapatnam ) మారబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

 Ys Jagan Mohan Reddy Comments About Ap Capitals Details, Ap Capitals, Ap Cm, Ys-TeluguStop.com

విశాఖపట్నం నుండి పరిపాలన కొనసాగించబోతున్నట్లుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో మరో సారి మూడు రాజధానుల విషయం ప్రస్తావనకు వస్తోంది.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికలను( AP Assembly Elections ) వైజాగ్ లో ఉండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాడు.

అమరావతి రాజధాని ప్రాంతం లోని ఎమ్మెల్యే స్థానాలపై ఆశ వదులుకుని ఇతర ప్రాంతాల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమ లోనే ఎక్కువ స్థానాలను దక్కించుకోగలిగితే కచ్చితంగా వైకాపా మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.పైగా వచ్చే ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Ap Assembly, Ap, Ap Cm, Chandrababu, Janasena Ycp, Lokesh, Telugu, Vishak

అదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని.అందుకే మూడు రాజధానుల విషయమై కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సొంత పార్టీని నేతలు కొందరు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Ap Assembly, Ap, Ap Cm, Chandrababu, Janasena Ycp, Lokesh, Telugu, Vishak

ఈ నేపథ్యంలో ఆయన తీసుకోబోయే రాజకీయ వ్యూహం ఏంటి అనేది చూడాలి.ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపు లోకేష్ యువగళం పేరుతో పాద యాత్ర చేస్తున్నారు.

మొత్తానికి సీఎం జగన్ మోహన్‌ రెడ్డిని ఢీ కొట్టేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube