తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన బవాల్ సినిమాలో నటించింది.

ఇటీవల ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోకీ విడుదల చేశారు.జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా కొన్ని సీన్స్‌పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా ఆష్విట్జ్‌తో( Auschwitz ) ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు.కాగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించింది.ఈ సందర్బంగా జాన్వీకపూర్ మాట్లాడుతూ.
ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు.అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.

అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు.అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు.కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది.
మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో( Second World War ) జరిగిన నష్టాన్ని చూపించడమే.మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను.ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు.
నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు.అది నాకెంతో గర్వంగా అనిపించింది అని తెలిపింది జాన్వీ కపూర్.







