ఏదైనా వీడియో చూడాలంటే మనకు టక్కున గుర్తు వచ్చేది యూట్యూబ్.ఇక సమాచారం ఏదైనా కావాలంటే వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తాం.
ఇక ఎప్పటికప్పుడు ఈ టెక్ దిగ్గజ కంపెనీలు ఫీచర్లు అప్‌డేట్ చేస్తున్నాయి.తాజాగా మ్యూజిక్ లవర్స్ కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల రెండింటికీ ఉపయోగపడేలా ‘రేడియా బిల్డర్‘ అనే ఫీచర్ పని చేయనుంది.దీనిని గూగుల్ అభివృద్ధి చేసింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చాలా మందికి ఖాళీ సమయాల్లో మ్యూజిక్ వినడం అలవాటు.అలాంటి వారి కోసం యూట్యూబ్‌లో ‘రేడియా బిల్డర్’ అనే ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చింది.ఇప్పటికే యూట్యూబ్‌లో మ్యూజిక్ కోసం ఓ ఆప్షన్ ఉంది.
ఈ యూ ట్యూబ్ మ్యూజిక్ అనే ఆప్షన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ రేడియో బిల్డర్ ఫీచర్ ఉపయోగపడనుంది.దీని సాయంతో యూజర్లు తమకు ఇష్టమైన జోనర్‌లో పాటలను సెలెక్ట్ చేసుకోవచ్చు.
తర్వాత వాటన్నింటినీ ఒకే చోట చేర్చవచ్చు.
ఇలా తమకిష్టమైన పాటలను ఒకే చోట చేర్చుకుని వాటిని ఆస్వాదించవచ్చు.రేడియా బిల్డర్ సాయంతో మీరు 30 మంది గాయకుల లేదా సంగీత దర్శకుల పాటలను ఎంచుకోవచ్చు.వారివి మాత్రమే పాటలు వినాలనుకున్నా, ఇతరులవి కూడా వినాలనుకున్నా మార్చుకునే అవకాశం ఉంది.
అదనంగా, మీకు ఇప్పటికే తెలిసిన పాటలు, కొత్త పాటలు లేదా రెండింటి కలయికను మీరు వినొచ్చు.ఈ సేవను ఉపయోగించడానికి, మీరు యూట్యూబ్ మ్యూజిక్ మెయిన్ పేజీకి వెళ్లి ‘My Music Tuner‘ విభాగాన్ని పొందే వరకు క్రిందికి స్క్రోల్ చేయాలి.
అప్‌డేట్ చేసిన ఫీచర్ iOS మరియు Android లో రెండింటిలోనూ ఉంటుంది.ఇది యూట్యూబ్ పెయిడ్ యూజర్లకు, సామాన్య యూజర్లకు ఇరువురికీ ఉపయోగపడుతుంది.