భద్రాద్రి రామయ్య పట్టాభిషేకానికి.. ఇన్ని నదుల పుణ్య జలాల సేకరిస్తున్న అర్చకులు..

మార్చి నెల 31వ తేదీన భద్రాద్రి రామయ్య(Bhadradri Ramayya) మహా సామ్రాజ్య పట్టాభిషేకానికి దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.60 సంవత్సరాలకు ఒకసారి ప్రభావ నామ ఏడాది లో జరిగే ఈ పట్టాభిషేకానికి దేవాలయ అర్చకులు ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.దేశంలోని చాలా రాష్ట్రాలలో దేవాలయ అర్చకులే నేరుగా వెళ్లి పుణ్య జలాలను సేకరిస్తున్నారు.వాటితో స్వామివారికి పట్టాభిషేకం చేయనున్నారు.

 Bhadradri Ramayya Pattabhisekam Priests Collecting Water From Sacred Rivers Deta-TeluguStop.com

స్వామివారికి ప్రతిరోజు రామాయణ పారాయణా జరుగుతూ ప్రతి పుష్పమి రోజు పట్టాభిషేకం నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి 60 ఏళ్ల తరువాత ప్రభావ నామ సంవత్సరంలో శ్రీరాములవారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు చెబుతున్నారు.వందల సంవత్సరాలుగా క్రమంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనదిగా అర్చకులు చెబుతున్నారు.

జీవితకాలంలో దానిని దర్శించలేని వారికోసం 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర పట్టాభిషేకంగా విడదీసి అదే సాంప్రదాయంలో జరుపుతున్నారు.

Telugu Bakti, Devotional, Mahasamrajya, Sacred-Latest News - Telugu

మార్చి నెల 31వ తేదీన జరగబోయే రెండవ పుష్కర మహా సామ్రాజ్య పట్టాభిషేకం(Maha Samrajya Pattabisekam) కోసం దేశంలోని నదులు, సముద్రాల నుంచి పవిత్ర జలాలను సేకరిస్తున్నారు.మంత్ర సహితంగా ఈ పవిత్ర జలాలను తీసుకొని రావడానికి ఇప్పటికే దేవాలయ అర్చకులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి జలాలను సేకరిస్తున్నట్లు సమాచారం.పశ్చిమ దిక్కు తీర్ధ సేకరణ లో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో పశ్చిమ సముద్ర తీర్థం స్వీకరించారు.

దక్షిణం వైపు తమిళనాడులో వానమామలై దివ్యదేశము దేవనాయగన్ పెరుమాళ్ సన్నిధి పుష్కరిణి తీర్థం కూడా స్వీకరించినట్లు సమాచారం.

Telugu Bakti, Devotional, Mahasamrajya, Sacred-Latest News - Telugu

ముఖ్యంగా చెప్పాలంటే మేల్కోట దివ్య క్షేత్రమునందు కళ్యాణి పుష్కరిని తీర్థము, మహారాష్ట్రలోని పండరీపూర్ నందు చంద్రభాగ నది తీర్థం, కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం దర్శించి అక్కడ పుణ్య జలాలను(Sacred Water) తీసుకొస్తున్నారు.ఇలా వివిధ రాష్ట్రాలలో తిరిగి అన్ని నదులతో పాటు సముద్ర జలాలను కూడా సేకరించి ఈ పుణ్య జలాలతో మార్చి 31వ తేదీన రామయ్యకు అభిషేకాన్ని నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube