నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.
సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసేసారు మేకర్స్.
ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి.
ఇక ఇప్పుడు ఈ సీజన్ 6వ ఎపిసోడ్ కోసం కూడా రెడీ అవుతుంది.
సీజన్ 2 అన్ని ఎపిసోడ్స్ కూడా పర్వాలేదు అనిపించినా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎపిసోడ్ మాత్రం లేదు.దీంతో ఈసారి అదిరిపోయే రేంజ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు.
మన టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా దూసుకు పోతున్న స్టార్ ప్రభాస్.ఈయనను ఈ షోకు తీసుకు రాబోతున్నారు.

ఒకపక్క డార్లింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య షో కోసం రాబోతున్నాడు.గత కొన్ని రోజుల నుండి ఈ షోకు ప్రభాస్ రాబోతున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి.ఈ రూమర్స్ ను నిజం చేస్తూ మేకర్స్ అఫీషియల్ గా ఒక వీడియోను షేర్ చేసారు.ఈ వీడియో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
ఈ వేదిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇంతకీ ఈ వీడిలో ఏముంది అంటే.
ఆహా ఓటిటి వారు ప్రభాస్ మాషాప్ వీడియోను షేర్ చేసి ఈయన ఈ షో కోసం వస్తున్నట్టు తేలిపారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ ఆఫ్ గాడ్ బాలయ్యతో కనిపించ బోతున్నాడు అని తెలిపాడు.
బాలయ్య ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అని ఆయన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







