YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైదరాబాద్ లో తన నివాసం వద్ద దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పై అపోలో ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో షర్మిలను హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు… ఆ సమయానికి షర్మిల తక్కువ రక్తపోటు, నీరసం, తల తిరగడం ఇంకా డిహైడ్రేషన్, ఆర్తోస్టాటిక్ హైపోటెన్షన్ తీవ్రస్థాయి ఒలిగురియా… ఇంకా పలు లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
మంచినీళ్లు కూడా తీసుకోకుండా నిరాహారదీక్ష చేయడంతో బాగా నిరసించిపోయారని.
అయితే ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేయడం జరిగింది.ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం డిస్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
మూడు వారాల్లో పూర్తిగా కోలుకుంటారని.అప్పటిదాక విశ్రాంతి అవసరం అని స్పష్టం చేయడం జరిగింది.







