కొన్ని కొన్ని సార్లు హీరోయిన్స్ షేర్ చేసుకునే పోస్టులకు నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వారి ఫేస్ లపై బాగా కామెంట్లు చేస్తుంటారు.
వాళ్ళ ఫేసులలో కాస్త తేడాగా అనిపిస్తే చాలు వెంటనే రకరకాలుగా ట్రోల్ చేసి నెట్టింట్లో వైరల్ చేస్తారు.తాజాగా హీరోయిన్ మృణాల ఠాకూర్ పై కూడా టార్గెట్ చేశారు నెటిజన్స్.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
భారతదేశానికి చెందిన నటి మృనాల్ ఠాకుర్.
ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక 2014లో విట్టి దండు అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది.
ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.
ఇక తెలుగులో ఈ ఏడాది సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది.
చాలా వరకు ఈ ముద్దుగుమ్మ హిందీ వెండి తెరపై నటించగా అక్కడనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా అనే సినిమాతో పరిచయం కాగా ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత ఏడాది వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంది.అందులో సూపర్ 30, బట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా సినిమాలో నటించగా ఈ సినిమాలు తనకు మరింత గుర్తింపును అందించాయి.
ఇక ఈ ఏడాది జెర్సీ, ఆంఖ్ మిచోలి అనే సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
అలా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు.దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడటంతో మంచి అభిమానం సొంతం చేసుకుంది.

కెరీర్ మొదట్లో సీరియల్స్ తో పాటు పలు ప్రకటనలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.మొత్తానికి 12 ఏళ్లు చాలా కష్టపడి తెలుగు వెండితెరపై అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఈ న్యాచురల్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపడుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలలో తాను కాస్త డిఫరెంట్ గా కనిపించింది.పైగా చెవిలో పువ్వు పెట్టుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
అయితే అందులో తను ఒక ఫోటోలో ముసలావిడిలా కనిపించడంతో.వెంటనే ఓ నెటిజన్ ఆ ఫోటో డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ అందులో అచ్చం ముసలి దాని లాగా ఉన్నావు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.







