టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా వయస్సు పెరుగుతున్నా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తూ యంగ్ జనరేషన్ హీరోయిన్లకు షాకిస్తున్న సంగతి తెలిసిందే.గుర్తుందా శీతాకాలం సినిమాతో తమన్నా ఖాతాలో ఫ్లాప్ చేరింది.
ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో నటించడంతో తమన్నాకు ఈ సినిమా మైనస్ అయిందే తప్ప ప్లస్ కాలేదు.ఈ సినిమా చూసిన తమన్నా అభిమానులు గుర్తింపు లేని పాత్రలకు తమన్నా ఓకే చెప్పడం తమకు ఇష్టం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న పెద్ద సినిమా భోళా శంకర్ మాత్రమే కాగా హిందీ, మలయాళ భాషల్లో పలు ప్రాజెక్ట్ లతో తమన్నా బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది.తమన్నా 2 కోట్ల రూపాయల లోపు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటూ ఉండటంతో ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి ఎక్కువమంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం వల్ల ఆమెకు ఆఫర్లు పెరుగుతున్నాయి.
ప్రముఖ నటి జయమాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా అంటే మా ఆయనకు చాలా ఇష్టమని కామెంట్లు చేశారు.

ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ హీరోయిన్ గా చేయడం బాగుందని జయమాలిని తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో కృష్ణుడి పాత్రలో నటించి ఆ తర్వాత మాతో కలిసి డ్యాన్స్ చేశారని ఆమె తెలిపారు.ఆ తర్వాత కాలంలో చిరంజీవి బాగా డ్యాన్స్ చేశారని జయమాలిని చెప్పుకొచ్చారు.

మా ఆయనకు తమన్నాతో పాటు కాజల్ అంటే కూడా ఇష్టమని జయమాలిని కామెంట్లు చేయడం గమనార్హం.జయమాలిని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమన్నాకు సెలబ్రిటీల కుటుంబాలకు చెందిన వాళ్లలో కూడా అభిమానులు ఉన్నారని తెలుస్తోంది.భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.







