మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అత్యధిక వసూళ్లు ఇచ్చే ప్రాంతం నైజాం ఏరియా.ప్రస్తుతం ఇక్కడి మార్కెట్ సగటున 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.
ఈ ప్రాంతం లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు( Pawan Kalyan , Mahesh Babu ) మరియు ప్రభాస్( Prabhas ) కి అత్యధిక వసూళ్లు మరియు ఓపెనింగ్ రికార్డ్స్ వస్తుంటాయి.మిగిలిన హీరోలకు కూడా ఓపెనింగ్స్ వస్తాయి కానీ, కచ్చితంగా అదిరిపోయే రేంజ్ టీజర్ కట్ మరియు పాటలు ఉండాలి.
కానీ పైన చెప్పిన ఆ ముగ్గురు హీరోలకు వాటితో ఎలాంటి అవసరం లేదు, కేవలం ఫ్యాన్ బేస్ తోనే మోతెక్కిపోయే రికార్డ్స్ ని పెడుతుంటారు.రేపు ఆదిపురుష్( Adipurush ) చిత్రం విడుదల అవుతుంది.
నైజం ప్రాంతం అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం అదిరిపోయాయి.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి ఈ ప్రాంతం లో కచ్చితంగా నాన్ రాజమౌళి రికార్డు వస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ప్రస్తుతం నైజాం ప్రాంతం లో నాన్ రాజమౌళి డే 1 రికార్డు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ( Bhimla Naik )చిత్రం పై ఉన్నది.ఈ చిత్రానికి ఇక్కడ 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారు పాట( Sarkaru Vari pata ) 11 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ తో, అల్లు అర్జున్ పుష్ప( pushpa ) సినిమా 11 కోట్ల 30 లక్షల షేర్ తో మరియు KGF చాప్టర్ 2 11 కోట్ల రూపాయిల షేర్ తో టాప్ 5 రికార్డ్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నిటినీ ఆదిపురుష్ చిత్రం బద్దలు కోట్లు నైజాం ప్రాంతం నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆదిపురుష్ చిత్రం #RRR మూవీ తర్వాతి స్థానం లో ఉంది.
విడుదలకు ముందు హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా టాప్ 5 మూవీస్ లిస్ట్ ఒకసారి తీస్తే #RRR మూవీ 10.4 కోట్ల రూపాయిల గ్రాస్ తో టాప్ 1 స్థానం లో నిలిస్తే , ఆదిపురుష్ చిరం 9 కోట్ల రూపాయిల గ్రాస్ తో టాప్ 2 స్థానం లో ఉంది.ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం 8 కోట్ల రూపాయిల గ్రాస్ తో మూడవ స్థానం లో నిలిస్తే , భీమ్లా నాయక్ చిత్రం 6 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ తో నాల్గవ స్థానం లో, అలాగే 6 కోట్ల 17 లక్షల రూపాయిల గ్రాస్ తో KGF చాప్టర్ 2 ఐదవ స్థానం లో కొనసాగుతుంది.
వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదల అవ్వబోతుంది.ఈ చిత్రం ఆదిపురుష్ రికార్డ్స్ ని బద్దలు కొటుతుందా లేదా అనేది చూడాలి.