హైదరాబాద్ లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకునే టాప్ 5 సినిమాలు ఇవే!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అత్యధిక వసూళ్లు ఇచ్చే ప్రాంతం నైజాం ఏరియా.

ప్రస్తుతం ఇక్కడి మార్కెట్ సగటున 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.ఈ ప్రాంతం లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు( Pawan Kalyan , Mahesh Babu ) మరియు ప్రభాస్( Prabhas ) కి అత్యధిక వసూళ్లు మరియు ఓపెనింగ్ రికార్డ్స్ వస్తుంటాయి.

మిగిలిన హీరోలకు కూడా ఓపెనింగ్స్ వస్తాయి కానీ, కచ్చితంగా అదిరిపోయే రేంజ్ టీజర్ కట్ మరియు పాటలు ఉండాలి.

కానీ పైన చెప్పిన ఆ ముగ్గురు హీరోలకు వాటితో ఎలాంటి అవసరం లేదు, కేవలం ఫ్యాన్ బేస్ తోనే మోతెక్కిపోయే రికార్డ్స్ ని పెడుతుంటారు.

రేపు ఆదిపురుష్( Adipurush ) చిత్రం విడుదల అవుతుంది.నైజం ప్రాంతం అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం అదిరిపోయాయి.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి ఈ ప్రాంతం లో కచ్చితంగా నాన్ రాజమౌళి రికార్డు వస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

"""/" / ప్రస్తుతం నైజాం ప్రాంతం లో నాన్ రాజమౌళి డే 1 రికార్డు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ( Bhimla Naik )చిత్రం పై ఉన్నది.

ఈ చిత్రానికి ఇక్కడ 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారు పాట( Sarkaru Vari Pata ) 11 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ తో, అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సినిమా 11 కోట్ల 30 లక్షల షేర్ తో మరియు KGF చాప్టర్ 2 11 కోట్ల రూపాయిల షేర్ తో టాప్ 5 రికార్డ్స్ గా నిలిచాయి.

ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నిటినీ ఆదిపురుష్ చిత్రం బద్దలు కోట్లు నైజాం ప్రాంతం నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

4 కోట్ల రూపాయిల గ్రాస్ తో టాప్ 1 స్థానం లో నిలిస్తే , ఆదిపురుష్ చిరం 9 కోట్ల రూపాయిల గ్రాస్ తో టాప్ 2 స్థానం లో ఉంది.

ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం 8 కోట్ల రూపాయిల గ్రాస్ తో మూడవ స్థానం లో నిలిస్తే , భీమ్లా నాయక్ చిత్రం 6 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ తో నాల్గవ స్థానం లో, అలాగే 6 కోట్ల 17 లక్షల రూపాయిల గ్రాస్ తో KGF చాప్టర్ 2 ఐదవ స్థానం లో కొనసాగుతుంది.

వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'బ్రో ది అవతార్' చిత్రం విడుదల అవ్వబోతుంది.

ఈ చిత్రం ఆదిపురుష్ రికార్డ్స్ ని బద్దలు కొటుతుందా లేదా అనేది చూడాలి.

షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి.. రానా రెస్పెక్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!