వయసు పైబడటం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి వంటి కారణాల వల్ల ముఖ చర్మంలో ఉండే కండరాల పటుత్వం తగ్గి పోతుంటుంది.దాంతో చర్మం సాగి.
యవ్వనాన్ని దెబ్బ తీస్తుంది.ఈ క్రమంలోనే సాగిన చర్మాన్ని మళ్లీ టైట్‌గా మార్చుకోవడం వల్ల ఏవేవో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తుంటారు.
కొందరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ కూడా చేయించు కుంటారు.కానీ, దానిమ్మ పండుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా స్కిన్ టైటనింగ్ ఫేస్ క్రిమ్ను తయారు చేసుకుని వాడితే.
సులభంగా సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం దానిమ్మతో స్కిన్ టైటనింగ్ ఫేస్ క్రిమ్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పు దానిమ్మ గింజలు వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.అలాగే ఒక చిన్న సైజ్ బంగాళ దుంపను కూడా తీసుకుని పీల్ తొలగించి పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ బంగాళదుంప జ్యూస్, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి బీటర్ సాయంతో ఐదారు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే స్కిన్ టైటనింగ్ క్రీమ్ సిద్ధమైనట్టే.
ఈ క్రీమ్‌ను ఒక డబ్బాలో నింపుకుని ఫిడ్జ్‌లో పెట్టుకుంటే.వారం రోజుల పాటు వాడుకోవచ్చు.రోజుకు రెండు సార్లు ఈ క్రీమ్‌ను ఫేస్‌కు అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.ఇలా చేస్తే సాగిన చర్మం టైట్‌గా మరియు బ్రైట్‌గా మారుతుంది.చర్మంపై ముడతలు ఉన్నా అవి క్రమంగా తగ్గు ముఖం పడతాయి.