పాకిస్థాన్‌లోని ఈ ప్రాంతంలో దడపుట్టించే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... ఎందుకంటే..

ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత పాకిస్థాన్‌లోని జాకోబాబాద్‌లో నమోదవుతుంటుంది.పాకిస్థాన్‌లోని ఈ నగరంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతంగా పేరొందింది.

 Jacobabad Records The Worlds Highest Temperature, Jacobabad , Pakistan , Highest-TeluguStop.com

పాకిస్థాన్‌లోని జాకోబాబాద్‌లో గరిష్టంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఇది 126 ఫారెనైట్‌కు సమానం.ఇది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అని స్పష్టమయ్యింది.

ఇంతటి ఉష్ణోగ్రతల సమయంలో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.ఇది చాలా కాలం పాటు ఇదే ఉష్ణోగ్రత కొనసాగితే అప్పుడు జ్వరం, అవయవ వైఫల్యం మొదలైన అనేక రుగ్మతలు తలెత్తుతాయి.

జాకోబాబాద్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉంది.ఇది రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దులలో ఉంది.

ఇక్కడ ఎల్లప్పుడూ వేడి వాతావరణం ఉంటుంది.ఇంతకు ముందు యూఏఈలోని రాస్ ఎల్ ఖైమా నగరంలో కూడా ఇదే తరహాలో వేడి వాతావరణం ఏర్పడింది.

ఇక్కడ ఉష్ణోగ్రత 52 డిగ్రీలుగా నమోదయ్యింది. జాకోబాబాద్‌ భౌగోళిక పరిస్థితుల గురించి ప్రస్తావించాల్సి వస్తే.

అది కర్కాటక రేఖ యొక్క ఎగువ ప్రాంతంలో ఉంది.దీని కారణంగా సూర్య కిరణాలు నేరుగా ఇక్కడ పడతాయి.

ఫలితంగా ఇక్కడ వేడి వాతావరణం ఏర్పడుతుంది.రాజస్థాన్‌ ప్రాంతం కూడా ఈ కారణంగానే వేడిగా ఉంటుంది.

కర్కాటక రేఖ పాకిస్థాన్ గుండా వెళ్లదని, పాకిస్థాన్ దిగువ భాగంలో గుండా వెళుతుంది.దీని కారణంగా ఇక్కడ వేడి ప్రభావం అధికంగా ఉంటుంది.

దీంతో పాటు సముద్రం కారణంగా ఇక్కడ తేమశాతం కూడా అధికంగా ఉండడంతో వేడి ఎక్కువగా ఉంటుంది.ఇంతే కాకుండా పాకిస్థాన్, రాజస్థాన్ సమీపంలోని ప్రాంతం సింధు లోయ నాగరికత ప్రదేశంగా పరిగణిస్తారు.

ఇది వాతావరణ మార్పులకు ప్రభావితమైంది.ఈ కారణంగా ఈ ప్రాంతంలో వేసవిలో అత్యంత వేడిగానూ, శీతాకాలంలో అత్యంత చలిగానూ ఉంటుంది.

Jacobabad Records The Worlds Highest Temperature, Jacobabad , Pakistan , Highest Temperature , Rajastan , Gujarat , - Telugu Gujarat, Temperature, Jacobabad, Pakistan, Rajastan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube