తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.1996లో విడుదలైన ప్రేమదేశం అప్పటి రోజుల్లో ప్రేమకథా చిత్రాల్లోనే ట్రెండ్ సెట్టర్ అన్న సంగతి తెలిసిందే.అబ్బాస్- వినీత్ ( Abbas- Vineet ) ల నటన టబు అందచందాలు, వడివేలు కామెడీ, ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఒక ఊపు ఊపాయి.ఈ సినిమాతో అబ్బాస్ వినీత్ ఇద్దరు భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
అయితే ఇప్పుడు అబ్బాస్, వినీత్ ఇద్దరూ సినిమాలకు దూరమయ్యారు.కానీ అబ్బాస్ పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిన స్థితికి వెళ్లడంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది.

నటుడు అబ్బాస్ ఇప్పుడు న్యూజిలాండ్‌లో( New Zealand ) టాక్సీ నడుపుతున్నాడని కూడా వార్తలు వినిపించాయి.అలా అయితే 90వ దశకంలో వరుసగా క్రేజీ చిత్రాల్లో నటించిన అబ్బాస్, హార్పిక్( Harpic ) సహా పలు వాణిజ్య ప్రకటనలలో నటించి భారీగా సంపాదించారు .కానీ కెరీర్ ఊపులో ఉన్నప్పటికీ అతడు తన డబ్బును ఎలా వృధా చేశాడు? అంటూ చర్చ సాగింది.అయితే అతడు ఉన్న డబ్బును కోల్పోవడానికి కారణాలు ఏమి అన్నదానిపై కంద సుబ్రమణియమ్ అనే తమిళ రచయిత చెప్పిన వివరాలు క్వారాలో ఇలా ఉన్నాయి.
అరవింద్ స్వామి స్ఫూర్తితో అబ్బాస్ పెద్ద వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకున్నాడట.

అతడు తన డబ్బును కొన్ని వెంచర్లలో పెట్టాడట.పిజ్జా సెంటర్ , కంప్యూటర్ సెంటర్లు ( Pizza Center, Computer Centers )నడిపాడు.కానీ పిజ్జా ఫ్రాంచైజీ మునిగిపోయింది.
తరవాత కంప్యూటర్ సెంటర్ నడపగా అది కూడా నష్టాల బాట పట్టిందట.అలాగే అజిత్ కంటే ముందు, అబ్బాస్ ఎల్లప్పుడూ స్టార్టప్‌లపై పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు.
కానీ అవేవీ కలిసి రాలేదు.తర్వాత దుబాయ్‌లో పెద్ద ఆస్తి నష్టంలో రజనీ,SRK ఎక్కువగా నష్టపోయారని అప్పటికే టాక్ ఉండగా, అబ్బాస్ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి పేరును కోల్పోయారని టాక్ ఉంది.
అతడు తనకు అప్పులిచ్చిన రుణదాతలకు తిరిగి చెల్లించడానికి చాలా మంది నిర్మాతల నుండి అప్పు తీసుకున్నాడు.ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించి అప్పులు తీర్చుకున్నాడు.
ఈ విధంగా అబ్బాస్ సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా పోగొట్టుకున్నారట.







