సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు ఉన్న ప్రాధాన్యత చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.అంతేకాదు.
ప్రస్తుతం చాలా సినిమాల్లో హీరోయిన్లను కేవలం అందాల ఆరబోతకే పరిమితం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.హీరోయిన్లకు మంచి పాత్రలు రావడం అనేది అరుదుగా మారింది.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కి స్ర్కీన్ మీద ఎక్కువ టైం ఇవ్వడం అనేది రేర్ గా జరుగుతుంది.అయితే కొన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు నాన్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు కూడా.ఈ అవకాశాలను వినియోగించుకుని మంచి నటనతో ఆకట్టుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు.
అదే సమయంలో డ్యూయెల్ రోల్స్ కూడా చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఇంతకీ ఆయా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరయిన్లు ఎవరు? ఏ సినిమాలో చేశారు? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
అనుష్క : ఈమె అరుంధతి, పంచాక్షరి, ఇరండాల్ ఉలగం అనే సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేసింది.
విజయశాంతి : జానకి రాముడు సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.
కాజల్ అగర్వాల్ : క్యూట్ బ్యూటీ కాజల్ మగధీర రెండు పాత్రలు చేసింది.
సమంత అక్కినేని : 10 సినిమాలో సమంత డ్యుయెల్ రోల్ చేసింది.
రమ్యకృష్ణ : పార్త జ్ఞాబగం ఇల్లయో అనే తమిళ సినిమాలో ఈమె రెండు క్యారెక్టర్లు చేసింది.

దీపిక పదుకొన్ : చాందిని చౌక్ టు చైనా అనే సినిమాలో ఈ పొడుగు కాళ్ల సుందరి రెండు పాత్రలు చేసింది.
జ్యోతిక : పేరళగన్
వాణిశ్రీ : గంగ మంగ
ఐశ్వర్య రాయ్ : జీన్స్
కృతి సనన్ : రాబ్తా
అంజలి : గీతాంజలి, మసాలా

శ్రీదేవి: గురు, నాకాబందీ, చాల్ బాజ్, బంజారన్, ఖుదా గవా, లమ్హే, రుదేవ్
హేమమాలిని : సీతా ఔర్ గీత
మీరా జాస్మిన్ : అమ్మాయి బాగుంది
మీనా: నాడోడి మన్నన్
స్నేహ : పార్తిబన్ కనవు
జయప్రద : సంజోగ్
ఆసిన్ : దశావతారం