సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా కొనసాగుతున్నటువంటి అనసూయ( Anasuya ) నిర్మొహమాటంగా తనకు తోచిన అభిప్రాయాన్ని సలహాలను సూచనలను తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈమె ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండ ( Vijay devarakonda ) నటించిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా సమయం నుంచి ఆయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇక ఈ సినిమా సమయంలో ఏకంగా డిబేట్లలో పెట్టి మరీ విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి విజయ్ దేవరకొండ అలాగే ఆయన అభిమానులతో అనసూయ వాగ్వాదానికి దిగుతూ వచ్చారు.
![Telugu Anasuya, Anasuyalatest, Arjun Reddy, Sandeep Reddy-Movie Telugu Anasuya, Anasuyalatest, Arjun Reddy, Sandeep Reddy-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Anasuya-latest-comments-against-Vijay-devarakondab.jpg)
ఇకపోతే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను గెలుకుతూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే నటి పార్వతి ఇటీవల చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.గతంలో పార్వతి, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొనె పాల్గొన్న ఒక కార్యక్రమంలో పార్వతి మాట్లాడుతూ.అర్జున్ రెడ్డి కావొచ్చు కబీర్ సింగ్ కావొచ్చు.ప్రేమను వ్యక్తం చేయాలంటే కొట్టడం అనేది హింసను ప్రేరేపించడమే.సినిమాలలో ఇలాంటి సీన్స్ లేకుండా దర్శకులను మనం ఆపలేము కానీ నటీనటులుగా మనం ఆపవచ్చు అంటూ ఈమె మాట్లాడారు.
![Telugu Anasuya, Anasuyalatest, Arjun Reddy, Sandeep Reddy-Movie Telugu Anasuya, Anasuyalatest, Arjun Reddy, Sandeep Reddy-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Anasuya-latest-comments-against-Vijay-devarakondac.jpg)
ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి అనసూయ.ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.అలాగే మంచిని షేర్ చేయడానికి వచ్చిన వీరందరిని అభినందించాలని అనసూయ కోరారు.మరొక కామెంట్ లో… నేను ఇదే విషయాన్ని చెప్పినందుకు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.
నాకు మద్దతు ఇచ్చేందుకు స్ట్రాంగ్ పీ ఆర్ టీమ్, మీడియా, తోటి నటులు కూడా లేరు.నా భావాలను తెలియచేయడానికి అప్పుడు నాకు అంత అవగాహన లేదో అయినప్పటికీ నేను ఆగదు కొనసాగిస్తూనే ఉంటాను అంటూ ఈ సందర్భంగా అనసూయ మరోసారి పరోక్షంగా విజయ్ దేవరకొండను వదిలేదే లేదు అన్నట్టు అర్థం వచ్చేలా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.