పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన హవా ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి.మరి ఆయన ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ తను సినిమాలను మాత్రం ఎక్కడా వదిలిపెట్టకుండా తన అభిమానులను ఆనంద పరచడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.

అందులో భాగంగానే ప్రతి సినిమాలో వైవిధ్యమున్న పాత్రలను చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా మీద తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు.ఇక మొత్తానికైతే మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకొనే సమయం అయితే వచ్చింది.ఎందుకంటే సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ( OG Movie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆ డేట్ కి ఈ సినిమా ఇంకా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని రెడీ అవ్వదనే ఉద్దేశ్యంతోనే సినిమా మేకర్స్ మరో డేట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుక గా గాని లేదంటే సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో తన సత్తాను చాటుతాడు అనేది… ఎలక్షన్స్( Elections ) ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదే నిజమైతే ఈ సినిమా వీలైనంత తొందరగా వచ్చే ఏర్పాటును కూడా మేకర్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







