భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బత్తాయి సాగులో( Orange plantations ) అగ్రస్థానంలో ఉన్నాయి.బత్తాయి తోట పూత, పిందె, కాయ దశలలో ఉన్నప్పుడు చీడపీడల బెడద చాలా అంటే చాలా ఎక్కువ.
వీటిని సకాలంలో గుర్తించి తొలిదశలో అరికట్టడంలో ఆలస్యం జరిగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.బత్తాయి తోటలకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే.
నల్లి పురుగులు, రసం పీల్చే రెక్కల పురుగులు, మంగునల్లి ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తాయి.
ఈ నల్లి పురుగులు ( Black worms ) బత్తాయి కాయలను ఆశించి రసం పీల్చడం వల్ల ఆ ప్రాంతంలో ఊదా రంగు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ తరువాత కాయ అంతటా మంగు ఏర్పడుతుంది.
దీంతో కాయల పరిమాణం చిన్నగా ఉండడంతో పాటు కాయ తోలు గట్టిగా, పెళుసుగా తయారవుతుంది.ఇలాంటి కాయలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు.
![Telugu Die Kofal, Diphen Thuron, Bulb, Orange-Latest News - Telugu Telugu Die Kofal, Diphen Thuron, Bulb, Orange-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Comprehensive-plant-protection-measures-to-prevent-the-spread-of-insects-in-Orange-plantationsb.jpg)
ఈ పురుగులను బత్తాయి తోటల్లో గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల డై కోఫాల్ ( Die Kofal ) ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల డైఫెన్ థూరాన్( Diphen Thuron ) కలిపి పిచికారి చేయాలి.బత్తాయి పంట కోత దశలో ఉన్నప్పుడు రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం చాలా ఎక్కువ.
ఈ పురుగులు పండ్లపై సన్నని రంధ్రం చేసి రసం పీల్చడం వల్ల కాయలు పక్వానికి రాకముందే పండి రాలిపోతాయి.ఇలా రాలిపోయిన పండ్లను నాశనం చేయాలి.ఎందుకంటే ఈ పండ్ల రంధ్రాలలో శిలీంద్రాలు, బ్యాక్టీరియాలో( fungi , bacteria ) ఉండే అవకాశం ఉంది.
![Telugu Die Kofal, Diphen Thuron, Bulb, Orange-Latest News - Telugu Telugu Die Kofal, Diphen Thuron, Bulb, Orange-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Comprehensive-plant-protection-measures-to-prevent-the-spread-of-insects-in-Orange-plantationsc.jpg)
బత్తాయి తోటలో ఫ్లోరోసెంట్ బల్బును ( fluorescent bulb ) అమర్చి రాత్రిపూట బల్బు ఆన్ చేస్తే.రసం పీల్చే రెక్కల పురుగులు ఆకర్షింపబడతాయి.కాయలు పక్వానికి రాకముందే ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ బల్బులు ఆన్ లో ఉండాలి.
ఒక మిల్లీలీటరు మలాథియాన్, పంచదార ఒక శాతం ను పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని లైట్ల కింద ఉంచి పురుగులను అరికట్టాలి.బత్తాయి కాయలకు బుట్ట కట్టడం వల్ల కాయ సంరక్షించబడుతుంది.
బత్తాయి తోట చుట్టూ చెట్ల పొదలు లేదంటే తిప్పతీగలు ఉంటే వాటిని తీసేస్తే ఈ రసం పీల్చే రెక్కల పురుగుల బెడద తక్కువగా ఉంటుంది.ఇలా పంటను సంరక్షించుకుంటే నాణ్యమైన అధిగ దిగుబడి పొందవచ్చు.