మందులతో పని లేకుండా గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి రిలీఫ్ పొందాలా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యలో గ్యాస్ ట్రబుల్ ( Gas trouble )ముందు వ‌రుస‌లో ఉంటుంది.ఏదైనా తిన్నారంటే చాలు కడుపు ఉబ్బరంగా మారిపోయి గ్యాస్ తన్నేస్తూ ఉంటుంది.

 Try These Tips To Relieve Gas Problem! Gas Problem, Simple Tips, Gas, Bloating,-TeluguStop.com

గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.అయితే అలాంటి సమయంలో మందులతో పని లేకుండా సహజంగా మరియు వేగంగా గ్యాస్ నుంచి రిలీఫ్ పొందడానికి ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడతాయి.

టిప్‌-1: మెంతులు, ఇంగువ( Fenugreek, Asafoetida ) ఈ రెండింటి కాంబినేషన్ గ్యాస్ నివారణకు అద్భుతంగా తోడ్పడతాయి.అందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తీసుకుని అందులో పావు టీ స్పూన్ వేయించిన మెంతి పొడి మరియు చిటికెడు ఇంగువ కలిపి సేవించాలి.ఇలా చేస్తే నిమిషాల్లో గ్యాస్ నుంచి ఉపశమనం పొందుతారు.

టిప్-2: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం రసం( Fresh ginger juice ), చిటికెడు నల్ల ఉప్పు మరియు చిటికెడు ఇంగువ మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేరుగా సేవించాలి.

ఇలా చేసినా కూడా గ్యాస్ సమస్య నుంచి సులభంగా బయటపడతారు.కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

Telugu Tips, Latest, Simple Tips, Tipsrelieve-Telugu Health

టిప్‌-3: గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలను దూరం చేయడానికి ఎండు ద్రాక్ష సహాయపడుతుంది.అందుకోసం ఒక గ్లాస్ కొవ్వు తీసిన పాలల్లో 8 నుంచి 10 ఎండు ద్రాక్ష వేసి బాగా ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన ఎండు ద్రాక్షను పాలతో సహా తీసుకుంటే గ్యాస్, కడుపులో మంట పరార్ అవుతాయి.పొట్ట ఫ్రీగా మారుతుంది.

Telugu Tips, Latest, Simple Tips, Tipsrelieve-Telugu Health

టిప్‌-4: మన వంట గదిలో ఉండే వాము కూడా గ్యాస్ నివారణకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది.హాఫ్ టీ స్పూన్ వామును నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తాగితే చక్కటి ఉపశమనం పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube