ఆరోగ్యానికి సిరి ఉసిరి.. జలుబు, నోటిపూత తో సహా ఎన్ని సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా?

ఉసిరి( amla ) ఆరోగ్యానికి సిరి అని అంటుంటారు.ఎందుకంటే మన ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు ఉసిరిలో నిండి ఉంటాయి.

 Incredible Health Benefits Of Amla! Amla, Amla Health Benefits, Amla Benefits, L-TeluguStop.com

ఆహారంలో ఉసిరిని భాగం చేసుకోవడం వల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.అలాగే జలుబు, నోటి పూత, మలబద్ధకం ( Colds, mouth sores, constipation )తదితర సమస్యలకు ఉసిరితో సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

అందుకు ఉసిరిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుత వర్షాకాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది.

పైగా ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే మిగతా వారికి కూడా వచ్చేస్తుంటుంది.అయితే జలుబు నివారణకు వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల జలుబు నుంచి చాలా వేగంగా బయట పడతారు.

Telugu Amla Benefits, Amla, Tips, Latest, Mouth Ulcer-Telugu Health

అలాగే నోటి పూత సమస్యను దూరం చేయడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది.రెండు ఉసిరి కాయలను మెత్తగా దంచి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో ఉసిరి జ్యూస్ మిక్స్ చేసి మౌత్ వాష్ ( Mouth wash )గా ఉపయోగించాలి.

ఉసిరి రసం కలిపిన వాటర్ తో రోజుకు రెండుసార్లు నోటిని పుక్కిలిస్తే నోటి పూత తగ్గుముఖం పడుతుంది.మలబద్ధకం నివారణకు ఉసిరి న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

రోజుకు ఒక ఉసిరికాయను నేరుగా నమిలి తింటే అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకం సమస్యను తరిమి కొడుతుంది.

Telugu Amla Benefits, Amla, Tips, Latest, Mouth Ulcer-Telugu Health

వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారికి కూడా ఉసిరి సహాయపడుతుంది.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉసిరి జ్యూస్ మరియు చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.అంతేకాకుండా ఉసిరిని ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

ఉసిరిలో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఐరన్ శోషణకు మద్దతు ఇచ్చి రక్తహీనత దరిచేరకుండా సైతం కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube