పుచ్చకాయ ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?

పుచ్చకాయ( watermelon ).చాలా మంది ఇష్టంగా తినే ఫ్రూట్స్ లో ఒకటి.

 How To Use Watermelon For Long And Healthy Hair? Long Hair, Thick Hair, Healthy-TeluguStop.com

ఆకారంలోనే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ పుచ్చకాయ దిట్టే.రోజుకు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినడం వల్ల వివిధ రోగాలకు దూరంగా ఉండవచ్చు.

అలాగే కురుల ఆరోగ్యానికి సైతం పుచ్చకాయ తోడ్పడుతుంది.ముఖ్యంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను కోరుకునే వారు ఇప్పుడు చెప్పబోయే పుచ్చకాయ మాస్క్ ను తప్పకుండా ట్రై చేయండి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloe vera leaf ) వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే పావు కప్పు ఫ్రెష్ అలోవెరా, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Watermelonlong, Latest, Thick, Watermelon-Telug

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.పుచ్చకాయలో విటమిన్ సి( Vitamin C ) ఉంటుంది.ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి.ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మ‌ద్దతు ఇస్తుంది.అలాగే పుచ్చకాయలో రక్త ప్రసరణను మెరుగుప‌రిచే అమైనో ఆమ్లాలు ఉంటాయి.

ఇవి జుట్టు పొడుగ్గా, వేగంగా పెర‌గ‌డానికి మరియు తక్కువ జుట్టు రాలడానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

Telugu Care, Care Tips, Healthy, Watermelonlong, Latest, Thick, Watermelon-Telug

అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న పుచ్చ‌కాయ మాస్క్ ను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల కురులు తేమ‌గా మార‌తాయి.జుట్టు విర‌గ‌డం, చిట్ల‌డం వంటివి త‌గ్గుముఖం ప‌డ‌తాయి.జుట్టు ద‌ట్టంగా పెరుగుతంది.

క‌ల‌బంద చుండ్ర స‌మ‌స్య‌ను నివారిస్తుంది.పెరుగు, కొబ్బ‌రి నూనె జుట్టును మృదువుగా మారుస్తాయి.

మూలాల నుంచి కురుల‌ను బ‌లోపేతం చేస్తాయి.జుట్టుకు కొత్త మెరుపును జోడిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube