సీజన్ తో పని లేకుండా ప్రతి ఒక్కరిని ఎప్పుడూ ఏదో ఒక జుట్టు సమస్య( Hair problem ) వేధిస్తూనే ఉంటుంది.జుట్టు అధికంగా రాలడం, చుండ్రు, జుట్టు ఎదుగుదల లేకపోవడం, కురులు తరచూ డ్రై అవ్వడం.
వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.అయితే వీటన్నిటికీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ క్రీమ్ తో చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ ఆ క్రీమ్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అల్లం ( Ginger )ముక్కను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండు తొక్కను( Peel lemon ) కూడా తీసి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో నిమ్మ పండు తొక్కలు మరియు అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు ముందుగా తయారు చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కల జ్యూస్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు కలిపితే మంచి క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలిగంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ క్రీమ్ ను వాడితే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం తగ్గి. ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ శుభ్రంగా మారుతుంది.మరియు ఈ హెయిర్ క్రీమ్ ను వాడటం వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మెరుస్తుంది.జుట్టు చిట్లడం, విరగడం, డ్రై అవ్వడం వంటి సమస్యలు కూడా నయం అవుతాయి.