బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు ( Mogali Rekulu ) సీరియల్ అప్పట్లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో మనకు తెలిసిందే.ఇప్పటికి మొగలిరేకులు సీరియల్ తిరిగి ప్రసారమైన ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవారు ఉన్నారు.
అంటే అతిశయోక్తి కాదు.ఇలా మొగలిరేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు( RK Naidu ) పాత్రలో నటించినటువంటి సాగర్ ( Sagar )ఎంతోమందికి అభిమానిగా మారిపోయారు.
ఈయన ఆర్కే నాయుడు, మున్నా పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సీరియల్ తర్వాత సాగర్ మరే సీరియల్స్ లోను నటించలేదు అదేవిధంగా ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు.ఈ సినిమా తర్వాత ఈయన పెద్దగా సినిమాలలో కూడా నటించలేదు అయితే చాలా రోజుల తర్వాత సాగర్ 100 సినిమాతో( 100Movie ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు సీరియల్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.మీకెందుకని తరువాత సీరియల్స్ చేయలేదనే ప్రశ్న ఎదురు కావడంతో అందుకు సాగర్ సమాధానం చెబుతూ నేను మొగలిరేకులు సీరియల్ ద్వారా చాలా మంచి సక్సెస్ అందుకున్నాను.అయితే ఈ సీరియల్ తర్వాత అదే స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి పాత్రలలో నటించాలి అనుకున్నాను అయితే ఆర్కే నాయుడు పాత్రకు సమానంగా తనకు ఎలాంటి పాత్రలు రాలేదు అందుకే సీరియల్స్ కి దూరంగా ఉన్నానంటూ సాగర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే 100 రాబోతున్నటువంటి ఈయనకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.







