ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో వాతావరణం చల్లగా మారడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
అలాగే కేశాలు కూడా పొడిబారిపోయి ఎండిపోయినట్టుగా అవుతాయి.దీంతో జుట్టు అందంహీనంగా కనిపిస్తుంది.
అందుకే వింటర్ సీజన్‌లో స్కిన్ పరంగానే కాకుండా కేశాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.ముఖ్యంగా కొన్ని కొన్ని తప్పులను జుట్టు విషయంలో అందులోనూ ఈ సీజన్‌లో అస్సలు చేయరాదు.
మరి ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నది తెలియాలంటే లేట్ చూయకుండా కిందకు ఓ లుక్కేసేయండి.
సాధారణంగా కొందరికి రెగ్యులర్‌గా తలస్నానం చేసే అలవాటు ఉంటుంది.
కానీ, వింటర్ సీసన్‌లో వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.డైలీ చేయడం వల్ల జుట్టు మరింత డ్రైగా మారడంతో పాటు హెయిర్ ఫాలో కూడా ఎక్కువగా ఉంటుంది.
అలాగే చలి కాలం కదా అని బాగా వేడిగా ఉన్న నీటితో ఎప్పుడూ తలస్నానం చేయకూడదు.ఇలా చేస్తే తలలోని సహజ మాయిశ్చరైజర్ దెబ్బతింటుంది.
ఫలితంగా, కేశాలు పొట్లిపోవడం, పోడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబ్టటి, గోరు వెచ్చగా ఉన్న నీటితో తలస్నానం చేయాలి.
ఇక ఈ వింటర్ సీజన్‌లో తడి జుట్టు ఆరడం చాలా కష్టం.అయినప్పటికీ, కాస్త ప్రశాంతంగా తలను ఆరబెట్టుకోవాలి.అలా కాకుండా తడి జుట్టునే జడ వేసేసుకుంటే చుండ్రు, దురద, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే నేటి కాలంలో చాలా మందికి అమ్మాయిలకు జుట్టు విరబోసుకుని తిరిగే అలవాటు ఉంటుంది.
కానీ, చలి కాలంలో అస్సలు ఇలా చేయరాదు.ఎందుకంటే, సాధారణంగానే చలి కాలంలో జుట్టు డ్రైగా మారి చిక్కు చిక్కుగా ఉంటుంది.
దీనికి తోడు జుట్టు విరబోసుకుని తిరిగితే మరింత చిక్కు పడి హెయిర్ ఫాల్‌కు దారి తీస్తుంది.