వాల్మీకి రామాయణం రాముడి జననానికి ముందు రాశారా.. తర్వాతా?

వాల్మీక త్రేతాయుగంలో రాముడు జీవించి ఉన్నప్పుడే రామాయణాన్ని రచించినట్లు రామాయణం చెప్తోంది.ఆ మహర్షి ఒకరోజు మద్యాహ్నం తమసా నదికి స్నానానికి వెళ్లాడు.

 Did Valimi Write Ramayana Before The Ramudu Birth Or After Valimi,  Ramayanam, R-TeluguStop.com

అక్కడ ఒక బోయవాడు క్రౌంచ పక్షల జంటల్లో ఒక పక్షిని బాణంతో కొట్టి చంపాడు.అది చూసి శోకానికి గురి అయిన వాల్మీకి అతడిని శపించాడు.

ఆ శాప వచనం ఛందో బద్దంగా ఆయన నుండి వెలువడింది.ఆశ్రమానికి వెళ్లి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా.

బ్రహ్మ ప్రత్యక్షమై రుషీ.నీకు శద్ద బ్రహ్మం స్వాధీనం అయింద.

ఆర్ష దృష్టితో నీవు రాముని చరిత్రను చెప్పు అని అంతర్థానం అయ్యాడు.

తర్వాత నారద మహర్షి వాల్మీకి చెంతకు వచ్చి… ఆ లోకంలో ఇప్పుడు గుణ వంతుడూ, వీర్య వంతుడూ, ధర్మజ్ఞుడూ, ఏక ధర్మ పత్ని… ఇలా పదనారు గుణాలు కల్గిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు.

అప్పుడు వాల్మీకి… నారదా అలాంటి వాడు ఒక్క అయోధ్య అధిపతి శ్రీ రామ చంద్రుడు మాత్రమే అని చెప్పి రామ కథను సంగ్రహంగా వివరించాడు.ఈ లోకంలో ఇప్పుడు ప్రశ్నించడాన్ని బట్టి అప్పుడు రాముడు రాజ్యం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

అందుచేత వాల్మీకి రామాయణాన్ని రాముని జననం తర్వాతే రాశడని తెలుస్తోంది.రామాయణ మహా కావ్యం ఏడు కాండాలుగా విభజించబడి ఉంది.

అయితే వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు.వేల శ్లాకాలు అని చెబుతారు.

ఏడవ కాండం అయిన ఉత్తర కాండం వాల్మీకి రచన కాదంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube