సనాతన ధర్మంలో అన్ని దేవతలతో పాటు పాములను కూడా ప్రజలు పూజిస్తారు.హిందూమతంలో పాము ఆరాధన మతపురమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
శివుడు తన మెడలో నాగేంద్రుడిని హారంగా ధరిస్తాడు.శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) శేషుడిని శయ్యగా చేసుకుని నిద్రిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు కాళీయుడిపై నృత్యం చేసినట్లు పురాణాలలో ఉంది.జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో కూడా పాము కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు.
పాములకు సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలు కూడా మన దేశంలో ఉన్నాయి.ఇప్పుడు ఈ పుణ్య క్షేత్రాలలో చేసే పూజల వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో కాలసర్పదోషం ఉన్నట్లయితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.ఇలా సర్ప దోషం ఉన్నవారు నియమా, నిబంధనతో సర్పానికి పూజ చేయాల్సి ఉంటుంది.ఈ దోష నివారణకు సర్పముతో సంబంధం ఉన్న పవిత్ర తీర్థయాత్రలకు వెళ్లి పూజ చేయడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఉజ్జయినిలోని నామచంద్రేశ్వర్( Namachandreshwar in Ujjain ), ప్రయాగలోని తక్షకేశ్వర్ నాగవాసుకి దేవాలయాల్లో కాలసర్ప దోషానికి సంబంధించిన పూజలు చేస్తే కాలసర్ప దోషం దూరమైపోతుంది అని ప్రజలు నమ్ముతారు.
అదేవిధంగా కేరళలో ( Kerala) ఉన్న మన్న రసాల దేవాలయం సర్ప క్షేత్రం గా పరిగణిస్తారు.

ఇక్కడ వేలాది విగ్రహాలు, పాముల చిత్రాలు ఉన్నాయి.ప్రజలు దీనిని స్నేక్ టెంపుల్ అని కూడా చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే జాతకంలో కాలసర్పదోషం తొలగిపోవడానికి ఎవరైనా నాగేంద్రుడి పుణ్యక్షేత్రానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.
అలాగే వెండితో చేసిన సర్పన్ని సర్ప తీర్థానికి తీసుకుని వెళ్లి పూజించి ప్రవహించే పవిత్ర జలంలో నిమర్జనం చేస్తే జాతకంలో కాలసర్ప దోషం దూరమై ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ప్రజలకు నమ్ముతారు.ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషానికి సంబంధించిన బాధల, భయాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.