ప్రతి ఇంట్లో అద్దాలు తప్పనిసరిగా ఉంటాయి.ఇక కొంతమంది ఒక అద్దాన్ని( Mirror ) పెట్టుకుంటారు.
అయితే మరికొందరెమో ఇల్లంతా అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు.వాస్తు శాస్త్రం లో అద్దానికి ముఖ్యమైన స్థానం ఉంది.
అద్దాలకు సానుకూల ప్రతికూల శక్తులను ఆకర్షించే శక్తి ఉంది.వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం పెట్టే సమయంలో ఇంటి శక్తి ప్రవాహంలో వ్యత్యాసంగా ప్రతికూల శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా వాస్తు ప్రకారం అద్దాలు ఉంచినప్పుడు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తిని పెంచుతుంది.
అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగిస్తుంది.అందుకే అద్దాలను ఈ నియమాలు పాటిస్తూ పెట్టుకోవాలి.అద్దాన్ని ఎల్లప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచాలి.
అదేవిధంగా అవి భూమి నుండి నాలుగు ఐదు అడుగుల ఎత్తున ఉండాలి ఎల్లప్పుడూ గోడపై ఫ్లాట్ గా ఉండాలి.ఇక అద్దాలను వంటగదిలో అస్సలు ఉంచకూడదు.
మరీ ముఖ్యంగా అవి గ్యాస్ స్టవ్ లేదా వంట ప్రదేశంలో ప్రతిబింబించకుండా ఉండేలా చూసుకోవాలి.
ఇక స్టడీ టేబుల్ కు అద్దాలను దూరంగా ఉంచడం మంచిది.ఎందుకంటే అది ఏకాగ్రత స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.దీనివల్ల మీ పని భారం రెట్టింపు అవుతుంది.
అంతేకాకుండా అద్దం యొక్క ఫ్రేమ్ చెక్క ది కాకుండా మెటల్ ది ఉన్నట్టు చూసుకోవాలి.అంతేకాకుండా అద్దాలను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
దీని వలన స్పష్టమైన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక మీరు వ్యాపారాన్ని( Business ) నడుపుతూ ఉంటే మీ వ్యాపారంలో మంచి లాభాల కోసం మీ కార్యాలయంలో నగదు లాకర్ ను కలిగి ఉంటే ఆ లాకర్ కు ఎదురుగా అద్దాన్ని ఉంచుకోవాలి.
దీన్ని లాకర్ లోపల కూడా ఉంచుకోవచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం( Northeast ) లేదా వాయువ్యంలో నీటి శాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అద్దాలను ఉంచాలి.
ఇక దుకాణంలోకి ప్రవేశించినప్పుడు చాలామంది రెండు వైపులా అద్దాలు పెడుతుంటారు.ఇది చాలా మంచి పద్ధతి.
ఇది మరింత వ్యాపారాన్ని ఆకర్షిస్తుంది.
LATEST NEWS - TELUGU